నల్గొండ

దళారుల వ్యవస్థ నిర్మూలనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మార్చి 21: ఆర్టీఏ కార్యాలయాల వద్ద దళారుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానీయా అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో ఏర్పాటు చేస్తున్న వెహికిల్ ఫిట్‌నెస్ నిర్మాణం పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతుండటంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ఆర్టీఏ కార్యాలయాల వద్ద సాగుతున్న దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అదునాత శాస్తస్రాంకేతిక పరిజ్ఞానంతో ఫిట్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అడ్మిస్ట్రేషన్ బ్లాక్ నిర్మాణం పూర్తి జరిగిందన్నారు. షెడ్‌ల నిర్మాణం పూర్తి కావస్తుందని చెప్పారు. వచ్చే మాసంలో యంత్రాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల వాహనాలు ఉన్నాయని గుర్తుచేశారు. సిరిసిల్లలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. అదేవిధంగా సిద్దిపేటలో మరో డ్రైవింగ్ స్కూల్‌ను హెచ్‌పిసిఎల్ సహకారంతో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఆర్టీఏ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాప్ ద్వారా పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, మోటారు వాహనాల ఇన్స్‌పెక్టర్లు ఉప్పల శ్రీనివాస్, పి.జనార్ధన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ సుదర్శనాచారి, ఎఇ శరత్, బిఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డి గోవిందరాజులు తదితరులు ఉన్నారు.