నల్గొండ

యాదాద్రి పవిత్రతను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, జూలై 11: తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటం నిత్యం వేలాదిగా భక్తులు వస్తుండటంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని ఎవరైన అసాంఘిక కార్యకలాపాలకు, సెటిల్‌మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కొండపైన శ్రీ లక్ష్మీనారసింహ్మస్వామి దర్శనానంతరం కొండ క్రింద డిఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించారు. దేవస్థానం దుకాణ సముదాయం వెనుక కళాశాల విద్యార్ధులు, హైస్కూల్ విద్యార్ధులు ఏర్పాటు చేసిన హరిత హారంలో పాల్గొని మొక్కలను నాటారు.తదనంతరం మహేశ్వరీ ఫంక్షన్‌హాలులో సెక్స్ వర్కర్ల అవగాహన సదస్సులోమాట్లాడుతూ ఇతర ప్రాంతాలనుంచి మైనర్ బాలికలను, మహిళలను ప్రలోభపెట్టి తీసుకు వచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని రెండు సార్ల వారిపై కేసులు నమోదు అయితే మూడవ సారి పిడి ఆక్ట్ పెడుతామన్నారు.యాదగిరిగుట్ట ప్రవిత్రతలో భాగస్వాములు కావాలని, వారి పిల్లలను చదివించేందుకు ప్రభుత్వ హాస్టల్‌లో ప్రవేశం కల్పిస్తామని,ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. ఈ జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో మంచిగా బ్రతుకేందుకు ముందుకు రావాలన్నారు.తదనంతరం సెక్స్ వర్కర్ల పరీస్థితులను అడిగి తెలుసుకున్నారు.మొదటి ప్రయత్నంగా మీ పిల్లలను చదివించాలని అన్నారు.తదనంతరం రౌడీ షీటర్స్ అవగాహనా సదస్సులో పాల్గొని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్చలు తప్పవని, అవసరమైతే పిడి ఆక్ట్ పెడతామని అన్నారు. యాదాద్రి,్భవనగిరి ప్రాంతాలు అభివృద్ది చెందుతున్న తరుణంలో లాండ్ మాఫియాలు తయారై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని భూములు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగిఉంటే వారిపై గల రౌడీ షీట్లను తొలగిస్తామన్నారు. నయాం పేరు చెప్పి ఇతరులతో దురుసుగా ప్రవర్తించినా,అక్రమ వసూళ్లుచేసినా కఠిన చర్యలు తప్పవన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోహన్‌రెడ్డి,్భవనగిరి సిఐ శంకర్‌గౌడ్,యాదగిరిగుట్ట సిఐ రఘువీర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి,రాజపేట, ఆలేరు, తుర్కపల్లి ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.