నల్గొండ

ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 11 : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు పర్యావరణ పరిరక్షణకు హరితహారంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మొక్కలను నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. నేటి కుటుంబ ప్రణాళిక రేపటి ప్రగతికి సూచికగా భావించాలన్నారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు అని ప్రచార కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏజేసి వెంకట్రావు పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి భానుప్రసాద్‌నాయక్, డెమో తిరుపతిరెడ్డి, జిల్లా మలేరియా అధికారి హోంప్రకాశ్,టిబి నియంత్రణ అధికారి అరుంధతి, ఏఎంఓ దుర్గయ్య, తిరుపతయ్య, కృష్ణస్వామి, చలపతిరావు, జబ్బర్, అపర్ణ, దీప్తి నర్సింగ్ స్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు.