నల్గొండ

ఉపాధితో వలసల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మార్చి 22: ఉపాధిహామీ చట్టం రావడంతో వలసలు తగ్గి కూలీల జీవితాల్లో వెలుగు లభించిందని డ్వామాపిడి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎంవిఎన్ స్మారక భవనంలో ఉపాధిహామీ చట్టం 10 ఏళ్ల అమలు - ఫలితాలు - అనుభవాలు అంశంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ చట్టం రావడం వల్ల వలసలు తగ్గాయని, ఈ కరువులో 200రోజుల పనిదినాల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తామన్నారు. ఉపాధిహమీ చట్టం పకడ్బందీగా అమలు జరిగేందుకు కూలీలు, మేట్ల సహకారం అవసరమని పేర్కొన్నారు. వ్యకాస రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రావులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరువు నెలకొందని, 200రోజులకు పనిదినాలు పెంచి దినసరి వేతనం 300 ఇవ్వాలని, మేట్లకు సెల్‌ఫోన్, సైకిల్ సౌకర్యాలతోపాటు టెంట్లు, మెడికల్ కిట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మేట్లకు పిడి చేతుల మీదుగా గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మేట్ల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సదస్సులో వ్యకాస జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, బొప్పని పద్మ, దొడ అంజయ్య, జిల్లా అంజయ్య, సైదులు, లింగస్వామి, పద్మావతి, లక్ష్మీ, నర్సయ్య, బొల్లు వసతంకుమార్ తదితరులు ఉన్నారు.