నల్గొండ

సూర్యాపేటలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 22: పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ సీజన్‌లో గతంలో తేలికపాటి వర్షం కురియగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుండి 3.30గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని కొత్తబస్టాండ్, జీ-షాపింగ్‌మాల్ సమీపంలో రోడ్డుపై మొకాళ్ల లోతులో వరదనీరు నిలిచిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే విధంగా పట్టణంలోని ప్రధాన నాలాలో వరదనీరు పోటెత్తడంతో వీఆర్‌డీఆర్ థియోటర్ సమీపంలో నాలా కట్ట తెగిపోవడంతో 60్ఫట్స్ రోడ్డును వరద నీరు ముంచెత్తింది. ఈ రోడ్డులో ఉన్న పలు కళాశాలలు, పాఠశాలలు, నివాస గృహాలు, ఎల్‌ఐసి కార్యాలయంలో వరద నీరు వచ్చి చేరింది. అదే విధంగా పట్టణంలోని సుందరయ్యనగర్, అన్నదురైనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, కమీషనర్ వడ్డె సురేందర్‌లు లోతట్టు ప్రాంతాలను సందర్శించి సహాయకచర్యలు చేపట్టారు. మొత్తంగా ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్షం కురియడంతో రైతులు, స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.