నల్గొండ

హరితహారంలో విధిగా పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, జూలై 24: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎం ఎల్ ఏ, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని హరితహారం కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయా గ్రామాలలో నాగినేనిపల్లి, మైలారం, బండకాడిపల్లి, సోలిపేట, బొమ్మలరామారం, గ్రామాలలో పలు శంకుస్థాపన చేసి అనంతరం నాగినేనిపల్లి గ్రామంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అందరు విధిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం రామాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జయమ్మ, ఎంపిపి బొల్లంపల్లి తిరుపతిరెడ్డి, జడ్పిటిసి మర్రి జయమ్మ, సర్పంచ్ గోద కల్పన, ఎంపిటిసి మేడబోయిన శశికళ, నాయకులు మర్రి కృష్ణారెడ్డి, గూదె బాలనర్సింహ్మ, పెద్దిరెడ్డి మల్లారెడ్డి, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి సతీష్‌గౌడ్, బక్కిరి బీరప్ప, వేముల సురేందర్‌రెడ్డి, సర్పంచులు పోలగౌని వెంకటేశ్‌గౌడ్, కేంసారం లక్ష్మి, కేతావత్ రత్నా, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.