నల్గొండ

భువనగిరిలో దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూలై 25: పట్టణంలో తాళాలు వేసున్న 10షాపులలో, 2గృహాలలో చోరికి పాల్పడి సుమారు5లక్షల విలువైన సొత్తు దోచుకెళ్లిన సంఘటన సోమవారం భువనగిరి పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది. భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మెరకు విద్యానగర్‌లోని జోగుస్వామి ఆదివారం రాత్రి ఇంటికి తాళంవేసి అనాజిపురం గ్రామానికి కుటుంభసభ్యులతోసహావెల్లగా దొంగలు తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడి 8తులాల బంగారు ఆభరణాలు, 15తులాల వెండి ఆభరణాలు, 8వేల నగదు దోచుకెల్లినట్లుగా తెలిపారు. అదేవిదంగా స్వామి ఇంటిప్రక్కనేగల మరో ఇంటితోపాటు పట్టణంలోని గంజ్ ఏరియా మార్కెట్‌యార్డ్‌లోగల శేఖపురం రవీందర్ షాపులో 2వేల నగదు, గణేష్ ట్రాన్స్‌పోర్ట్‌లో 24వేల నగదు, క్రాంతి ట్రాన్స్‌పోర్ట్‌లో 14వేల నగదు, జూలూరు వెంకటేశం షాపులో 3వేల నగదు, అదేవిదంగా జెల్ల వీరప్రకాశ్, సీతారామరాజు, సీతారామరాజు, చింత రవీందర్, బచ్చు శంకర్, తాడూరి బాలయ్య షాపులలో దొంగతనానికి పాల్పడినట్లుగా తెలిపారు. బాదితుల పిర్యాదు మెరకు కేసునమోదుచేసుకుని క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ల సహాయంతో దర్యాప్తు చేపట్టినట్లుగా భువనగిరి పట్టణ సిఐ మాదాసు శంకర్‌గౌడ్ తెలియజేసారు.
నిఘానేత్రాలున్నా దొంగతనాలను నిలువరించడంలో పోలీసుశాఖ విఫలం...
పట్టణంలో వీధివీదినా 100కుపైగా సిసి కెమెరాలున్నా దొంగతనాలను నిలువరించడంలొ పోలీసులు విఫలమైనారని ప్రజలు వాపోతున్నారు. సిసి కెమెరాలు పుటేజీలను పరిశీలించేందుకు మాత్రమేకాకుండా సంఘటనలను నివారించేందుకు ఎల్లప్పుడు సిసి కెమెరాలలో పట్టణ ప్రజల, అనుమానితుల కదలికలను పసిగట్టె యంత్రాంగం లేకపోవడంతో సంఘటన చోటుచేసుకున్నట్లుగా బాదితులు వాపోతున్నారు.