నల్గొండ

‘బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూలై 28: బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 11.38టి ఎంసిలకు తగ్గించి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని, భూనిర్వాషితులకు 2013్భసేకరణ పునరావాసం చట్టం క్రింద నష్టరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఆర్‌డిఒ కార్యాలయం ముందు బస్వాపురం రిజర్వాయర్ భూనిర్వాసితులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని తగ్గించి గ్రామాలు ముంపుకు గురికాకుండా ప్రాజెక్టులు నిర్మించాలని అన్నారు. 2013్భసేకరణ పునరావాస చట్టం క్రింద నష్టపరిహారం చెల్లించడంతో పాటు భూమికి భూమి ఇల్లుకు ఇల్లు వౌళిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోకారు.
రెండవ ఎఎన్‌ఎంల సమస్యలు
పరిష్కరించాలి..
11రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలను ఉద్ధేశించి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. రెండవ ఏఎన్‌ఎంలను క్రమబద్దీకరించి 10వ పిఆర్‌సి మేరకు వేతనాలు చెల్లించడంతో పాటు ఇఎస్‌ఐ, పిఎఫ్, జీవితభీమా సౌకర్యలు కల్పించాలన్నారు. రెండ ఏఎన్‌ఎంలతో వెంటనేప్రభుత్వం చర్చలు నిర్వహించాలని లేని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వేముల మహేందర్, మాటూరి బాలరాజు, దాసరి పాండు, దయ్యాల నర్సింహ్మ, మద్దెల రాజయ్య,తుర్కపల్లి సురేందర, పల్లెర్ల అంజయ్య పాల్గొన్నారు.