నల్గొండ

ఇదేమి అన్యాయ ం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 28: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పట్ల గులాబీ తమ్ముళ్లు గుస్సా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు కార్పోరేషన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీల చైర్మన్లపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఎదురుచూపులు రెండేళ్లు గడిచినా ఫలించకపోతుండటం..పైగా కొత్త జిల్లాల ఏర్పాటు పిదపనే నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తుండంతో మరికొంత కాలం నిరీక్షణ తప్పని దుస్థితి నెలకొంది. దీంతో 14ఏండ్లు ఉద్యమంలో ఎన్నో వ్యయప్రయాసాలతో నానాపాట్లు పడి పార్టీ కోసం, రాష్ట్ర సాధన కోసం పనిచేసిన తమకు నేడు స్వరాష్ట్రంలో సొంత పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా రెండేళ్లుగా నామినేటెడ్ పదవులైనా దక్కకపోవడం సమంజసంగా లేదంటు వాపోతున్నారు. నిన్నమొన్నటి దాకా నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందన్న నమ్మకంతో ఇతర పార్టీల నుండి టిఆర్‌ఎస్‌లోకి భారీగా చేరిన పలువురు నియోజకవర్గ స్థాయి నేతలు సైతం 2026దాకా డిలిమిటేషన్ సాధ్యంకాదని తేలడంతో వారంతా నామినేటెడ్ పదవులపై దృష్టి మళ్లించారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం జిల్లాల్లో మరింత పోటీ పెరిగిపోయింది.
మార్కెట్..దేవాలయాల పాలక మండళ్ల భర్తీకై నిరీక్షణ
జిల్లాలో 19వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా ఇటీవల రెండేళ్ల నిరీక్షణ పిదప ఆలేరు, తిరుమలగిరి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్లను మాత్రమే భర్తీ చేశారు. మిగతా 16వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకమండళ్ల చైర్మన్లను భర్తీ చేయాల్సివుంది. అలాగే యాదగిరిగుట్ట, మత్స్యగిరిగుట్ట, చెర్వుగట్టు వంటి 64ప్రధాన దేవాలయల పాలకమండళ్లను సైతం భర్తీ చేయాల్సివుంది. ఈ చైర్మన్ పదవుల కోసం గులాబీ తమ్ముళ్లు రెండేళ్లుగా ఎదురుచూపులు పడుతు ప్రభుత్వం తీరుపై అసహనంతో రగిలిపోతున్నారు. అదిగాక భర్తీ చేసిన మార్కెట్ కమిటీల పాలకమండళ్ల పదవీ కాలం కూడా గతంలో లేని రీతిలో దారుణంగా ఏడాది కాలానికి పరిమితం చేసిన వైనం దిగువ స్థాయి నాయకత్వాన్ని అపహాస్యం చేసినట్లుగా ఉందని వాపోతున్నారు. మార్కెట్ కమిటీ అధికారాలు, విధులపై అవగాహానకు వచ్చేసరికే తమ పదవి కాలం కాస్తా అవిరైపోతుందంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీల గెలుపు కోసం మండలాల్లో రాజీలేకుండా పనిచేసిన తమకు మార్కెట్ కమిటీలు,దేవాలయ పాలక మండళ్ల పదవులు సైతం అదిష్టానం ఇవ్వకపోవడం తమను చిన్నచూపు చూసినట్లుగా ఉందని నామినేటెట్ ఆశావాహులు భావిస్తున్నారు.
కొందరు ఎమ్మెల్యేలైతే చైర్మన్ పదవి ఆశావాహులను ఖర్చులు పెట్టుకోవాలంటు బెదురగొడుతుండటాన్ని దిగువశ్రేణి నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది. ఇంకోవైపు జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు, ఇతర పార్టీల నుండి వలసలు వచ్చిన నేతలకు అధిష్టానం చేసిన హామీల మేరకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో జరుగుతున్న జాప్యం సైతం పార్టీలో అంతర్గతంగా అసమ్మతిని రగిలించే దిశగా సాగుతుండటం గమనార్హం.