నల్గొండ

దైవకార్యంగా పుష్కర పనులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 29: కృష్ణా పుష్కరాలలో విధులు నిర్వహించే సిబ్బంది దైవకార్యంగా సేవాదృక్ఫదంతో విధులు నిర్వహించాలని జెసి సత్యనారాయణ తెలిపారు. కృష్ణాపుష్కరాల సందర్భంగా పెద్దవూర, పిఎపల్లి, చందంపేట మండలాలకు చెందిన పలుశాఖల కంట్రోల్ రూం సంబంధిత సిబ్బందికి నాగార్జునసాగర్‌లో శుక్రవారం నాడు విధి నిర్వాహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా హాజరైన జెసి సత్యనారాయణ మాట్లాడుతూ పుష్కర విధులలో ఏ ఒక్కరు పొరపాటు చేసినా తమ జిల్లాకు, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని, పుష్కర విధులను దైవ కార్యంగా భావించి విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వాహణపైనే సిబ్బంది దృష్టిసారించి పనిచేయాలన్నారు. తమతోపాటు విధి నిర్వహించే మిగతా శాఖల సిబ్బంది వివరాలను వారి విధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి పుష్కరఘాట్‌ను పారిశుద్ధ్య సిబ్బందికి లెమన్ కలర్ డ్రెస్‌ను, తాగునీటి సిబ్బందికి బ్లూకలర్ డ్రెస్‌ను,విద్యుత్ సిబ్బంది రెడ్‌కలర్ డ్రెస్‌ను, టాయ్‌లెట్ సిబ్బందికి ఆరంజ్ కలర్, కంట్రోల్ రూం సిబ్బందికి గ్రీన్ టీషర్ట్స్‌ను, గజ ఈతగాళ్లకు బ్లూకలర్ టీషర్ట్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. దీని వలన ఏ సిబ్బంది ఏ విధులు నిర్వహిస్తారు. అనే దానిపై పూర్తి అవగాహన కలుగుతుందన్నారు. కంట్రోల్ రూంలలో విధులు కేటాయించిన ప్రతి సిబ్బంది కూడా తమకు కేటాయించిన పుష్కరఘాట్లలో పుష్కరాల సమయానికి ముందే సందర్శించి పుష్కరఘాట్లలో ఏవి ఎక్కడ ఉన్నాయన్న దానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో పుష్కరాలలో సేవలందించాలని, పుష్కరాల సమయంలో తమ పండుగ వాతావరణంలా భావించి ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ శిక్షణ తరగతులలో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, మత్స్యశాఖ, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు, స్ర్తిశిశు సంక్షేమశాఖ, విద్యుత్, నీటిపారుదల, దేవాదాయధర్మాదాయ శాఖల అధికారులతోపాటు సంబంధిత కంట్రోల్ రూంలలో విధులు కేటాయించిన సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్‌పి సిఇఓ మహేంద్రరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రామచంద్రయ్య, వ్యవసాయశాఖ జెడి నర్సింహారావు, దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, సాగర్ డ్యాం ఎస్‌ఇ రమేశ్, ఇఇ విష్ణుప్రసాద్, పెద్దవూర మండల తహశీల్దార్ పాండునాయక్, ఎంపిడిఓ రఫీకున్నీసాభేగం వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.