నల్గొండ

వ్యర్థ నిర్వహణ ప్రాజెక్టు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఆగస్టు 2 :రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో డిటి ఎస్ ఎఫ్ ప్రమాదకర వ్యర్థముల నిర్వాహణ, నిల్వ కేంద్రాన్ని ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వినతిపత్రం అందించారు. 74 ఎకరాల భూమిని సేకరించి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని 553 ప్రమాదకర పరిశ్రమల నుంచి వెలువడే ఘన, ధ్రవ, రసాయన, బూడిదలతోపాటు జంతు, మానవ అవశేషాలను సంవత్సరానికి 1 లక్ష 73 వేల 896 మెట్రిక్ టన్నులు భూమిలో పాతి పెడతారన్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతంలో మూసి నీరు, భూగర్భజలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ తరహా ప్రాజెక్టు వల్ల చౌటుప్పల్ మండలంలో 60 కెమికల్ కంపెనీల ఏర్పాటుతో భూమి, భూగర్భజలాలు పూర్తిగా కలుషితమై పశుపక్షాదులకు, మనుషులకు ప్రమాదకరంగా మారాయన్నారు. వెంటనే ప్రమాదకర వ్యర్ధ నిర్వాహణ ప్రాజెక్టు ఏర్పాటును ఆపివేసి ఈనెల 5న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని కోరారు. దీనిపై గ్రామ కమిటీలో సైతం గ్రామ సభలో వ్యతిరేక తీర్మాణం చేశారు. కాగా ఈ నెల 4న పట్టణంలోని పి ఆర్ టియు భవన్‌లో టివివి ఆధ్వర్యంలో టిడి ఎస్ ఎఫ్‌కు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కంచర్ల భూపాల్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్, పిల్లి రామరాజు, యానాల లింగారెడ్డి, సిపి ఎం, సిపి ఐ నాయకులు జహంగీర్, లొడంగి శ్రవణ్‌కుమార్, దూదిమెట్ల సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.