నల్గొండ

కొనసాగుతున్న యాదాద్రి వర్తక సంఘం చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఆగస్టు 2:మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానం కొండపైగల 113 దుకాణాలను ప్రస్తుత మొత్తం దుకాణాల నెలసరి అద్దె 16.30లక్షలు చొప్పున వర్తక సంఘానికి ఇచ్చేందుకు దేవస్ధానం అంగీకరించింది .త్వరలో వీటిని వర్తక సంఘానికి అప్పగించనున్నారు.అభివృద్ది పనులు జరుగుతున్నందున దేవస్ధానం మరియు వర్తక సంఘం మధ్య ఒక అంగీకారం కుదిరింది. రెండు రోజులుగా చర్చలు జరిగినా సంఘం సమావేశంలో వర్తకుల మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపాయి.113 షాపుల స్ధానంలో దాదాపు 70 దుకాణాలు నడుపుకునేందుకు ఆయా దుకాణదారులు ముందుకు వచ్చారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎన్ని షాపులు పెట్టుకున్నా నెలసరి అద్దె రూపేణ స్వామి వారి ఖజానాకు వచ్చే 16.30లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.గతంలో షాపుల కాలపరిమితి ముగిసే సమయంలో వర్తక సంఘం వారు కొండపైన షాపులను తమకే ఇవ్వాలని షాపుల లీజు గడువు పొడిగించాలని కొత్తగా బహిరంగ వేలం వేయ్యవద్దని విజ్ఞప్తి చేశారు.దుకాణ దారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.కాని అంత డబ్బు తాము చెల్లించలేమని కిరాయ తగ్గించాలని వర్తక సంఘం కోరుకుంటోంది. దేవస్థ్ధానం వారు ససేమిరా అంటున్నారు.కాదు కూడదు అంటే కొత్త దుకాణాల వేలానికి దేవస్థానం సిద్దపడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.పస్తుతం ప్రాధమిక చర్చలు జరుగుతున్నాయి.ఏది ఏమైనప్పటికి దేవస్థానానికి వర్తక సంఘం ప్రతి నెలా రూ. 16.30 లక్షలు చెల్లించాలంటే తమపై అధిక భారం పడుతుందని దేవస్దానం వారు కిరాయ విషయంలో పునరాలోచిస్తే భాగుంటుందని వర్తక సంఘం నాయకులు వాపోయారు.