నల్గొండ

సహకార సంఘాల అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఆగస్టు 6: సహకార సంఘాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతిరెడ్డి కోరారు. కోదాడ మండలం గోండ్రియాల గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించిన సహకారగోదాంను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. తదుపరి సహకారసంఘం ఛైర్మన్ నర్సింహరెడ్డి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలకు స్వంతభవనాలు ఇతర వౌళిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. నియోజకవర్గ నిధులనుండి నియోజకవర్గపరిధిలోని సహకారసంఘాలకు సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుద్దీకరణకు చర్యలు తీసుకొంటానని ఆమె హమీ ఇచ్చారు. సహకార సంఘాలు ఆదాయాన్ని పెంచుకొని తద్వారా రైతులకు ఆర్ధిక చేయూతను అందించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. ఆదాయం పెంచుకొనే మార్గాలను సంఘాలు అనే్వషించి అనుసరించాలని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కోరారు. రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావుమాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటకు ఆశించిన ధర వచ్చేంతవరకు నిల్వ చేసుకొనేందుకు గోదాంలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదాంలో నిల్వ చేసిన ధాన్యం విలువలో 70 శాతంను రైతులకు రుణం రూపేణా అందించనున్నట్లు ఆయన వివరించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలను అందించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, డైరెక్టర్‌లు గరిణె కోటేశ్వర్‌రావు, డేగ బాబు, యంపిటిసి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. అమీనాబాద. దోరకుంట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సహకార గోదాంలను రాష్ట్ర సహకారబ్యాంక్ ఛైర్మన్ రవీందర్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాండురంగారావు, చందర్రావు, శశిధర్‌రెడ్డి, గరిణె కోటేశ్వర్‌రావు, అనంతగిరి సంఘం ఛైర్మన్ డేగ బాబు, చిమిర్యాల సంఘం ఛైర్మన్ కనగాల నర్సింహరావు, నాబార్డు డిడియం దయామృత స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.