నల్గొండ

జయశంకర్ బాటలో బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చూపిన తోవలో తెలంగాణ పునర్ నిర్మాణానికి, బంగారు తెలంగాణ సాధనకు ప్రజలంతా ముందుకు సాగాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి జి.జగదీష్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించి, జయంతి సందర్భంగ నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో కవిత మాట్లాడుతు తెలంగాణ ఉద్యమ నిర్వాహణలో కెసిఆర్‌కు, తెలంగాణ జాగృతి నిర్వాహణలో తనకు జయశంకర్ సార్ మార్గనిర్దేశం చేశారన్నారు. జయశంకర్ సార్ చూపిన బాటలో ఆయన అందించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతు తెలంగాణ ఉద్యమదివిటీని ఆరిపోకుండా సూచనలందిస్తు ఉద్యమ కాలంలో కెసిఆర్‌కు దిశానిర్దేశం చేస్తూ జయశంకర్ తెలంగాణ సాధన కోసం తన జీవితకాలం తపించారన్నారు. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా జీవితాంతం పోరాడిన వ్యక్తి జయశంకర్ అంటు శ్లాఘించారు. జయశంకర్ ఆశించిన రీతిలో తెలంగాణ సమగ్రాభివృద్ధిలో భాగంగా సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తుంటే రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని, పులిచింతల నిర్వాసితులకు ఎకరానికి లక్ష పదివేలు ఇస్తే కెసిఆర్ ప్రభుత్వం ఆరులక్షల వరకు చెల్లిస్తున్నారన్నారు. కెసిఆర్ ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు నేటికి సమాధానం చెప్పలేని ప్రతిపక్షాలు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణ అమరులకు, శ్రీకాంతచారికి, జయశంకర్‌కు దండవేయని జిల్లా కాంగ్రెస్ నేతలు నేడు తెలంగాణ పాట పడుతున్నారంటు చురకలు వేశారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాజీవ్‌సాగర్, జిల్లా ఎంపి బూర నర్సయ్యగౌడ్, మండలి డిప్యూటీ నేతి చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విప్ సునిత, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎమ్మెల్యేలు కిషోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నే ప్రభాకర్, పూల రవిందర్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో జయశంకర్ జయంతి
నల్లగొండ టౌన్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమ సిద్దాంత కర్త ప్రొఫేసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ ప్రేరణతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన కొత్తపల్లి జయశంకర్‌సార్ 82వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. ఆయన తాను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఎదుటి వారి జీవితాల్లో ఏ విధంగా అన్వయించాలో సమాజానికి సూచించిన గొప్ప కీర్తి ప్రధాత అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించిన వ్యక్తి జయశంకర్‌సార్ అని వివరించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫేసర్ జయశంకర్ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయిందని అన్నారు.