నల్గొండ

పుష్కరాలకు అన్నీ సిద్ధం: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 11: కృష్ణా పుష్కరాలకు నాగార్జునసాగర్‌లో పుష్కర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. గురువారం నాడు నాగార్జునసాగర్‌లోని పుష్కరఘాట్లను ఆయన సందర్శించి పరిశీలించారు. శివాలయం ఘాట్‌కు చేరుకోని ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ఉదృతికి మంగళవారం నాడు పడిపోయిన పుష్కరఘాట్ రక్షణ కంచె వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన రక్షణ కంచె పనితీరును పరిశీలించారు. ఆ సమయంలోనే కొంతమంది సందర్శకులు నీటిలోకి దిగగా అందులో ఒకరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండడంతో అక్కడ ఉన్న జాలర్లు అతన్ని కాపాడారు. ఈసంఘటన కలెక్టర్ ముందే జరగడంతో రేపటి వరకు ఇతరులెవ్వరిని కూడా పుష్కరఘాట్లలోకి వెళ్లనివ్వకుండా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంజనేయస్వామి ఘాట్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సాగర్‌లోని పుష్కరఘాట్ల పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. భక్తులు ఎంతో ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించి క్షేమంగా వారి నివాసాలకు చేరాలని ఆయన అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అంతకుముందు శివాలయఘాట్‌లో ఏర్పాటుచేసిన ఆరోగ్య వసతిగృహాన్ని ఆయన పరిశీలించారు. వీరితోపాటు సిఇఓ మహేంద్రరెడ్డి, జెడి నర్సింహారావు, తహశీల్దార్ పాండునాయక్, డ్యాం ఎస్‌ఇ రమేశ్, డిఇ విజయ్‌కుమార్, అడిషనల్ డిఎంహెచ్‌ఓ కృష్ణకుమారి, సాగర్ ఆరోగ్యశాఖ అధికారి హరికృష్ణలు ఉన్నారు.