నల్గొండ

పోలీసుల తీరును నిరసిస్తూ.. పురోహితుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి, ఆగస్టు 12: కృష్ణా పుష్కరాలలో పిండ ప్రదానాలు చేసే పురోహితుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ రాజగోపురం వద్ద పురోహితులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు సాంప్రదాయాన్ని గౌరవించకుండా పిండప్రదానం జరుగుతున్న సమయంలో పిండప్రదాన పదార్థాలను విసిరివేస్తూ మరొక చోట నిర్వహించుకోవాలని చేయడంపట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురోహితులు వినూత్నంగా మంత్రోచ్ఛారణ నిర్వహిస్తు నిరసన తెలపడంతో సమాచారం అందుకున్న ఐపిఎస్ అధికారి చందనకీర్తి ఘటన స్థలానికి చేరుకోని సమస్యపై ఆరాతీశారు. వారు ఆమె దృష్టికి తీసుకెళ్లగా దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని, శనివారం నుండి జరగబోయే కార్యక్రమాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పురోహితులు శాంతించారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు సైతం ఆమెకు తమ సమస్యలను విన్నవించారు. వాహన పాస్‌లు మంజూరు చేసి పంప్‌హౌస్ ప్రాంతంలోనే వాహనాలను నిలిపివేయాలని తీసుకురావద్దని పోలీసులు ఇష్టారీతిన చెబుతున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లగా శనివారం నుండి ఇటువంటి ఘటనలు మీడియాకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని హామి ఇచ్చారు.