నల్గొండ

వజినేపల్లిలో భక్తుల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 16: మండలపరిధిలోని బుగ్గమాధారం, వజినేపల్లి, కిష్టాపురం పుష్కరఘాట్లలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కృష్ణా నీటి ప్రవాహం ఘాట్ల వద్ద సాధారణ స్థాయిలో ప్రవహించడంతో భక్తుల సంఖ్య తగ్గింది. బుగ్గమాధారం ఘాట్ వద్ద కీర్తి సిమెంట్స్ యాజమాన్యం భక్తులకు పులిహోర ప్యాకెట్లను అందించారు. ఘాట్ వద్ద ఇసుక బస్తాలను వేసి నది ప్రవాహాన్ని మరలించారు. పితృదేవతలకు పిండ ప్రధానం చేసే భక్తులు ఎండ వేడిమిని భరించాల్సి వచ్చింది. వజినేపల్లి ఘాట్ వద్ద యథావిధిగానే కృష్ణా నది నీటిని మోటర్ల ద్వారా తోడి స్నాన ఘట్టాల వద్ద నింపుతున్నారు. వృద్దులు, వికలాంగులు సైతం పుణ్యస్నానాన్ని ఆచరించి పుష్కర పుణ్యాన్ని మూటకట్టుకున్నారు. వజినేపల్లి ఘాట్ వద్ద చిరువ్యాపారులు దుకాణాలు ఏర్పాటుచేసి అమ్మకాలపై దృష్టి సారించారు. సూర్యాపేట ఆర్డీవో నారాయణరెడ్డి ప్రతిరోజు ఘాట్ల వద్దనే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా వెల్లటూరు అనధికార ఘాట్‌కు భక్తులు వెల్లకుండా పోలీసులు రోడ్డు అడ్డంగా కంచెవేసి భక్తులను నిలిపివేశారు. సాగర్ నుండి నీటి విడుదల పెరిగినందున ప్రమాదాల దృష్ట్యా వెల్లటూరు పాత ఘాట్‌కు భక్తులను అనుమతించడం లేదని కోదాడ రూరల్ సిఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చింత్రియాల, రేబల్లెగ్రామాల వద్ద కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.