నల్గొండ

కాసరాజ్‌పల్లి ఘాట్ వద్ద ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఆగస్టు 17: చందంపేట మండలం కాసరాజ్‌పల్లి ఘాట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన షవర్ల క్రింద తలపై నీళ్ళు చల్లుకున్న అనంతరం ఆయన ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన శివాలయంలో పూజలు నిర్వహించారు. ఘాట్ సమీపం లోనే గిరిజన ఆరాధ్య దైవమైన తుల్జ్భావోజి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న కాసరాజ్‌పల్లిలో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుందన్నారు. మారుమూల ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రభుత్వం పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఇతర జిల్లాల నుండి కూడా ఈ ఘాట్‌లో స్నానాలు చేసేందుకు వస్తున్నారని దీని వల్ల కాసరాజ్‌పల్లి గ్రామం తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. కాసరాజ్‌పల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను గ్రామ సర్పంచ్, పుష్కరఘాట్ అధికారులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుష్కరఘాట్ అధికారులు వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, మూర్తి, నాయకులు కె లాలూనాయక్, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఆర్ వెంకటేశ్వర్‌రావు, శంకర్‌నాయక్, బొమ్ము తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.