నల్గొండ

కిష్టాపురం, వజినేపల్లిలో భక్తుల పుణ్యస్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 19: మండలపరిధిలోని కిష్టాపురం ఘాట్ వద్ద శనివారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఘాట్ వద్దకు కృష్ణా నీటి ప్రవాహం దాదాపు 6 అడుగుల మేర ప్రవహిసున్నా భక్తుల సంఖ్య మాత్రం తగ్గింది. కిష్టాపురానికి ప్రత్యేక బస్సుల కోసం ఆర్టీసీ ఆధికారులతో మాట్లాడినట్లు ఘాట్ అధికారులు తెలిపారు. స్థానిక రెడ్డి కుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత అన్నదానం శనివారం కొనసాగలేదు. దీంతో భక్తులు కొద్దిగా నిరుత్సాహపడ్డారు. ఇదీ ఇలా ఉండగా బుగ్గమాధారం, వజినేపల్లి పుష్కర ఘాట్లలో భక్తుల సంఖ్య అధికంగానే కనిపించింది. వజినేపల్లి వద్ద కృష్ణా నది నుండి భారీ మోటర్లతో నీటిని తోడి స్నాన ఘాట్లను నింపుతున్నారు. నీటి స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఘాట్ల వద్ద ఉన్న నీటిని శాంపిల్స్ సేకరించారు. ఘాట్ల వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో నారాయణరెడ్డి తెలిపారు.