నల్గొండ

ప్రమాదమైనా నదిలోనే స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ధఅడిశర్లపల్లి, ఆగస్టు 21: అజ్మాపూర్ కృష్ణా పుష్కర ఘాట్‌కు కృష్ణ జలాలు దూరంగా ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేసిన జల్లు స్నానాల ఏర్పాట్లను వినియోగించుకోవడం భక్తులు ఆసక్తి చూపడం లేదు. ఘాట్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ జలాశయం బ్యాక్ వాటర్‌లోకి వెళ్లి కృష్ణ జలాల్లో ప్రమాదకరంగా స్నానాలు చేస్తున్నారు. పుష్కరాల్లో చివరి సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఘాట్‌కు వచ్చారు. అధికారులు ఘాట్ నుండి నదిలోకి అనుమతించకపోయినప్పటికి వారి కళ్లుగప్పి భక్తులు నదిలోకి వెళ్లి పుష్కర స్నానాలు చేశారు. నాగార్జున సాగర్ ఘాట్‌లకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు కొండ మల్లెపల్లి దగ్గర నుండి చిన్నఅడిశర్లపల్లి నుండి పెద్దమునిగాల్, కాచరాజుపల్లికి, అజ్మాపూర్‌కు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఐనప్పటికి అక్కడికి చేరుకోకుండా సాగర్ వైపే భక్తులు వెళ్లిపోయారు. రహదారి తెలియన కొంతమంది భక్తులు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందుల పాలయ్యారు.