నల్గొండ

ధర్మభిక్షం స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మార్చి 26: దివంగత కమ్యూనిస్టు నేత, మాజీ ఎంపి బొమ్మగాని ధర్మభిక్షం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం చేసిన నిస్వార్థ సేవా స్ఫూర్తితో ప్రజాసేవలో గౌడ సంఘం నాయకులు పునరంకితం కావాలని ఎంపి బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపి మధుయాష్కిగౌడ్‌లు అన్నారు. శనివారం పట్టణంలోని గౌడ హాస్టల్‌లో ధర్మభిక్షం విగ్రహాన్ని ఆవిష్కరించి, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతు గీత కార్మికుల కుటుంబాల సంక్షేమానికి, గీత వృత్తి పరిరక్షణకు ధర్మభిక్షం చేసిన కృషి ఎన్నటికి మరువలేమన్నారు. పేదల సంక్షేమానికి, బిసిలు, ముఖ్యంగా గౌడ కులస్తుల ఉన్నతికి ధర్మభిక్షం చట్టసభలలో చేసిన పోరాటం గౌడ జాతికి మేలు చేసిందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాజ్యాధికారం దిశగా గౌడలు సంఘటితంగా పోరాడాలన్నారు. ట్యాంకుబండ్‌పైన పాపన్న విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించాలన్నారు. చట్టసభలలో గౌడ కులస్తుల సంఖ్య పెరుగాల్సివుందని, రాజ్యాధికారంలో తగినంత భాగస్వామ్యం సాధిస్తేనే గౌడ కులస్తులు ఆశించిన హక్కులను, ప్రయోజనాలను పొందగల్గుతారన్నారు. ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి 11లక్షల ఈతచెట్లు, 30లక్షల మేరకు విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. కేరళా మాదిరిగా జిల్లా గౌడ వృత్తిదారులు అభివృద్ధి చెందేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. జడ్పీటీసి తండు సైదులుగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వెంకటనారాయణగౌడ్, కటికం సత్తయ్యగౌడ్, సోమగాని శంకర్‌గౌడ్, స్వామిగౌడ్, సుంకరి మల్లేష్‌గౌడ్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్, చెరుకు సుధాకర్‌గౌడ్, దుశ్చల సత్యనారాయణ, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బొమ్మగాని ప్రభాకర్, సుర్వి లావణ్యశ్రీనివాస్, కనకయ్య, వంగాల వెంకన్నగౌడ్, మొగిళ్ల శ్రీనివాస్‌గౌడ్, మారయ్య గౌడ్, పానగంటి వెంకన్నగౌడ్, బండారు ధనుంజయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
‘షాదీముబారక్’ కేసులో వ్యక్తి అరెస్టు
* డిఎస్పీ సందీప్
మిర్యాలగూడ టౌన్, మార్చి 26: నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీకి చెందిన మసీదు రాము అనే వ్యక్తి షాదీముబారక్ పథకం కింద 51,000 రూపాయలు మంజూరు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలుకు పాల్పడ్డ ఆరోపణలపై శనివారం అరెస్టు చేసినట్టు స్థానిక డిఎస్పీ గోనే సందీప్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నవంబర్ 2015న పైలాన్‌కాలనీకి చెందిన తహసీన్ వివాహానికి షాదీముబారక్ కింద నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తానని మాయమాటలు చెప్పి పైరవీ చేశానని తండ్రి అబ్బాస్‌ను నమ్మించాడని ఆయన అన్నారు. పథకం కింద ఫిబ్రవరి 2016న 51,000 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ పైలాన్‌కాలనీ శాఖలో జమ కాగా, వెంటనే వచ్చి ఇస్తానన్న 10,000 రూపాయలు ఇవ్వాలని రాములు కోరాడని ఆయన అన్నారు. రాములు పైరవీ వల్ల మంజూరు కాలేదని తెలుసుకున్న తహసీన్ తండ్రి అబ్బాస్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించి నిందితుడు రామును అరెస్టు చేసినట్టు డిఎస్‌పి సందీప్ తెలిపారు. నిందితుడిని మిర్యాలగూడ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
మునగాల, మార్చి 26: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయరహదారిపై మండలంలోని మొద్దులచెర్వు స్టేజీవద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన గుంటూరు లక్ష్మితాయారు(63) కుటుంబసభ్యులతో కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా మొద్దులచెర్వు స్టేజీ సమీపంలో అదుపుతప్పి రోడ్డుపక్కన ఫల్టీకొట్టింది. దీంతో కారులో ప్రయాణీస్తున్న లక్ష్మితాయారు, ఆమె మనుమడు అచ్యుత్(13)లకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్సనిమిత్తం 108వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. అదేవిధంగా కారులో ప్రయాణీస్తున్న మృతురాలి కుమారులు శ్రీనివాస్, ఆదిత్య, కొడలు వసంతలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నగేష్ తెలిపారు.
చెన్నుగూడెంలో వ్యక్తి దారుణ హత్య
నల్లగొండ రూరల్, మార్చి 26: మండలంలోని నర్సింగ్‌భట్ల గ్రామ పంచాయితీ పరిధిలోని చెన్నుగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డళ్లతో అతి కిరాతకంగా హత్య చేయడంతో గ్రామం ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎడ్ల యాదయ్య (38) వృత్తిరీత్యా లారీ డ్రైవర్. హోళి పండుగ నాడు తన లారీ డ్యూటీని దిగిన యాదయ్య శుక్రవారం తన సమీప ఇంట్లో బంధువుల పెళ్లి జరుగుతుండగా ఉదయం నుండి రాత్రి 10.30నిమిషాల వరకు భార్య సునితతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. నూతన వధూవరుల ఊరేగింపు జరిగే సమయంలో అతను నిద్రించగా, భార్య, బంధువులు ఊరేగింపు వేడుకలో పాల్గొని 12గంటలకు వచ్చి చూడగా రక్తపుమడుగులో ముఖం గుర్తుపట్టరాకుంగా విగత జీవుడై ఉన్నాడు. సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ సిఐ, రవిందర్, ఎస్సై డానియేల్ కుమార్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలను రంగంలోకి దింపగా ఇంటికి కొద్ది దూరంలో తచ్చాడాయని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని వారు తెలిపారు. మృతునికి భార్యతో పాటు 5సంవత్సరాల కుమారుడు నాగరాజు, 3సంవత్సరాల కుమార్తె పల్లవిలు ఉన్నారు.

రెవెన్యూ సిబ్బంది నిర్బంధం

దేవరకొండ, మార్చి 26: నిబంధనల పేరుతో గ్రామాన్ని కాపాడుతున్న వాగు లోని ఇసుకను తరలించేందుకు గుత్తేదార్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజు మండలం లోని తాటికోల్ గ్రామస్థులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. గుత్తేదారులు అనుమతి తీసుకున్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతంలో తవ్వకాలు చేపడుతుండడంతో ఆగ్రహించిన గ్రామస్థులు మూకుమ్మడిగా వాగులోకి వెళ్ళి తవ్వకాలు చేస్తున్న హిటాచిని అడ్డుకున్నారు. ఆర్డీవో గంగాధర్ ఆదేశాల మేరకు అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అని నిర్ధారించేందుకు సర్వే చేసేందుకు వచ్చిన సర్వే ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఎ ఆర్ ఐ ప్రశాంత్, సర్వేయర్ బాలు, వి ఆర్వో మహేశ్‌లను గ్రామస్థులు నిర్బంధించారు. ఆర్డీవో, తహశీల్దార్‌లు వచ్చే వరకు సర్వే చేయవద్దని గ్రామస్థులు భీష్మించడంతో చివరికి పోలీస్‌లు వచ్చి గ్రామస్థుల నిర్బంధంలో ఉన్న రెవెన్యూ సిబ్బందిని విడిపించుకుపోయారు. గ్రామంలో తీవ్ర వివాదం రేపుతున్న ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాటికోల్ గ్రామాన్ని ఆనుకొని ఉన్న వాగులో అపారమైన ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇసుక ధర ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో అక్రమార్కుల కళ్ళు ఈ వాగుపై పడ్డాయి. తమకున్న రాజకీయ పలుకుబడితో అసైన్‌మెంట్ ల్యాండ్‌లో గతంలో లావుణి పట్టా పొందిన శ్యామల పెంటయ్య అనే వ్యక్తితో సర్వే నెంబర్ 1 లో ఉన్న ఇసుకను తవ్వుకునేందుకు అనుమతిని ఇప్పించాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టించారు. మిగిలిన తతంగమంతా పలుకుబడి ఉన్న నేతలు చూసుకోవడంతో ప్రభుత్వం 3.39 ఎకరాల భూమిలో ఇక్కడి నుండి 32176 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీన్ని ఆసరా చేసుకున్న కొంత మంది నాయకులు వాగు పక్కన సర్వే నెంబర్ 2,3 నెంబర్‌లలో పట్టా భూమి ఉన్న రైతుల పేర్లపై తమ భూమిలో ఇసుక పేరుకుపోయి వ్యవసాయం చేయడానికి ఇబ్బంది ఉందని ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇప్పించాలని ప్రభుత్వానికి రైతుల పేర్లతో దరఖాస్తు ఇప్పించి రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పి అనుమతులు తీసుకొచ్చారు. దీంతో గత వారం రోజలుగా అనుమతులు పొందిన కాంట్రాక్టర్ హిటాచీతో వాగులో తవ్వకాలు చేపట్టి వాహనాలు తిరిగేందుకు రోడ్డును ఏర్పాటు చేశాడు. దీంతో తాటికోల్ గ్రామస్థులంతా ఏకమై ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు గ్రామంలోకి వచ్చి సమాధానం చెప్పాలని సర్వే కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్గుకున్నారు.
సర్వే కోసం వచ్చిన సిబ్బందిని నిర్భందించడం సరైంది కాదు : ఆర్డీవో గంగాధర్
తాటికోల్ వాగులో ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్న గ్రామస్థులు తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని సర్వే చేయకుండా అడ్డుకొని నిర్బంధించడం బాధాకరమని ఆర్డీవో గంగాధర్ అన్నారు. సర్వే చేయకపోతే గుత్తేదారులు ఎక్కడ తవ్వకాలు జరుపుతున్నారో ఎలా నిర్ధారణ అవుతుందన్నారు. లావుణిపట్టా భూమిలో ఉన్న ఇసుకను పట్టాదారుడు అమ్ముకునే వీలు లేదన్నారు. అసలు అతనికి ఎలా అనుమతి వచ్చిందోనన్న విషయాలు విచారణలో తేలాల్సి ఉందన్నారు.