నల్గొండ

11వ రోజూ భక్తజన సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ/దామరచర్ల, ఆగస్టు 22: కృష్ణా పుష్కరాల సంరంభం ముగిసేందుకు కొద్ది గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ఈ పుణ్య సమయాన పుష్కర స్నానాలు ఆచరించి పునీతులయ్యేందుకు భక్తజన కోటి కృష్ణమ్మ వైపు పరుగులు తీస్తున్నారు. 12సంవత్సరాలకొకకసారి వచ్చే పుష్కరాల వేళ పుణ్య స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులతో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల, మఠంపల్లి, నాగార్జునసాగర్‌లోని పుష్కరఘాట్లన్ని జన సునామిని తలపించాయి. సోమవారం ఒక్కరోజే మిర్యాలగూడ డివిజన్‌లోని మట్టపల్లి, దామరచర్ల వాడపల్లి, నాగార్జునసాగర్‌లోని పుష్కరఘాట్లలో సోమవారం ఒక్కరోజే సుమారు 6.50లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కృష్ణా పుష్కరాలు ప్రారంభమై 11రోజులు గడిచినా భక్తులలో ఉత్సాహం తగ్గలేదు. జన సందోహంతో పుష్కరఘాట్లన్ని పులకరించాయి. మూడు మునకల కోసం భక్త జన కోట కృష్ణమ్మ వెంట బారులు తీరుతుండగా జనం ముందు జలం వెలవెలబోతుంటే నేల ఈనిందా అన్నట్లుగా కృష్ణాతీరం మారింది. పుష్కర స్నానాలకు వస్తున్న భక్తులు సోమవారం లక్షల్లోకి చేరింది. పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలతో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వివిధప్రాంతాల నుండి భక్తులు బస్సులు, వాహనాల్లో తరలిరావడంతో వాడపల్లి వద్ద ఉన్న ఎనిమిది ఘాట్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.
దైవదర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్‌లో నిల్చొన్నారు. దీంతో గంటల కొద్ది దైవదర్శనానికి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 2.50లక్షల మంది భక్తులు పుష్కర స్నానానికి రాగా దైవదర్శనం చేసుకునేందుకు ఆలయం ఉండి ఘాట్ల వరకు క్యూలైన్‌లో నిల్చొన్నారు. దీంతో చంటి పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉచిత బస్సులో ఆలయం నుండి ప్రయాణ ప్రాంగణం వరకు బస్సులను తరలించారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై భక్తులు ఎక్కువసేపు పుణ్యస్నానాలు ఆచరించకుండా త్వరత్వరగా పంపించారు. కాగా మఠంపల్లి మండలంలోని మట్టపల్లిలో సోమవారం లక్షన్నర మంది, నాగార్జునసాగర్‌లో సుమారు 2లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.

మహంకాళిఘాట్‌లో భక్తుల రద్దీ
నేరేడుచర్ల, ఆగస్టు 22: మండలంలో మహంకాళిగూడెం పుష్కరఘాట్‌లో సోమవారం మహారద్దీగా కనిపించింది. పుష్కరాల ముగింపు రెండవ చివరి రోజు అయినందున యాత్రీకులు హైద్రాబాద్, ఖమ్మం, వరంగల్ తదితర సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండప్రదానాలు అత్యధిక సంఖ్యలో చేశారు. పలు ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. స్థానికులై ఇతర ప్రాంతాల్లో వలస వెళ్లిన వారు, స్థానికుల బందువులు, స్నేహితులు మహంకాళి పుష్కరఘాట్ నిర్వాహణ సంతృప్తికరంగా ఉండడంతో యాత్రికులు తరలివచ్చి పుష్కర స్నానం చేశారు.

మట్టపల్లిలో 1.50లక్షల మంది పుష్కర స్నానాలు
మఠంపల్లి, ఆగస్టు 22: సోమవారం తెల్లవారుజామున 4గంటల నుండి పుష్కర స్నానం ఆచరించేందుకు పెద్దఎత్తున భక్తులు మట్టపల్లికి చేరుకున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. అనంతరం స్వామి దర్శనానికి క్యూలో నిలబడ్డారు. దీంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిక్కిరిసాయి. అన్ని అన్నదాన సత్రాలలో భక్తులు భోజనాల కోసం బారులుతీరారు. మఠంపల్లి నుండి మట్టపల్లి వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఉదయం టిటిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ పుష్కర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పితృదేవతలకు పిండప్రదానం నిర్వహించి నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.

మేళ్లచెర్వులో భక్తుల పుణ్యస్నానాలు
మేళ్లచెర్వు, ఆగస్టు 22: మండలపరిధిలోని బుగ్గమాధారం, వజినేపల్లి, కిష్టాపురం పుష్కఘాట్లలో సోమవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కిష్టాపురం ఘాట్ వద్ద ఐబి ఎస్ ఈ ధర్మానాయక్ పుణ్యస్నానాలు ఆచరించారు. స్థానిక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘాట్ల వద్దకు వచ్చిన భక్తులకు ఉచితంగా పులిహోర, భోజన సదుపాయాన్ని కల్పించారు. వజినేపల్లి ఘాట్ వద్ద మైహోమ్స్ సిమెంట్ పరిశ్రమ జిఎం మునగాల రాంమోహన్‌రావు దంపతులు, బంధువులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాయి లక్ష్మినారాయణ పుణ్యస్నానాలు ఆచరించారు. బుగ్గమాధారం ఘాట్ వద్ద కూడా భక్తులు అధికసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు.

మీడియా సెంటర్‌ను పరిశీలించిన ఐఅండ్‌పిఆర్ జిఇడి పద్మావతి
దామరచర్ల, ఆగస్టు 22: రాష్ట్ర ఐఅండ్‌పిఆర్ జిఇడి పద్మావతి సోమవారం పుష్కరఘాట్ వద్ద ఏర్పాటుచేసిన మీడియాపాయింట్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాచారం అందించడంలో మీడియా ముందుంటుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి కావాల్సిన సమాచారాన్ని అందించినప్పుడే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. మీడియాపాయింట్‌ను భక్తులకు అందుబాటులో ఉంచి వార్తలు సేకరించినందుకుగాను డిపిఆర్‌ఓ జగదీశ్‌ను అభినందించారు. అంతకుముందు ఆమె కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేసి దైవదర్శనం చేసుకున్నారు.