నల్గొండ

ఉద్రిక్తతల నడుమ ఎస్‌ఎంసి ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, ఆగస్టు26: మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎస్‌ఎమ్‌సి చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరిగింది. మండలకేంద్రంలో గతకొన్ని సంవత్సరాలుగా పాఠశాల కమిటి ఎన్నికల్లో సంకినేని వర్గందే పై చేయిగా ఉంటూ వారి కార్యకర్తలకే చైర్మన్ పదవులు దక్కేవి. ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ బాలుర పాఠశాల ఎస్‌ఎమ్‌సి చైర్మన్ ఎన్నిక ఏకపక్షంగా సాగి బిజెపి బలపరిచిన వ్యక్తి చైర్మన్ కావడం గమనార్హం. కాగా శుక్రవారం జరిగిన బాలికల పాఠశాల చైర్మన్ పదవి కూడా తమ అనుచరులకే దక్కేలా బిజెపి నాయకులు వ్యుహరచన చేయగా టిఆర్‌ఎస్ నాయకులు ఎత్తుకు పైఎత్తు వేశారు. దీంతో బిజెపి నాయకుల అంచనాలు తల క్రిందులై టిఆర్‌ఎస్ బలపరిచిన వ్యక్తికే చైర్మన్ పదవి దక్కింది. ఎన్నిక సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనాల్సిన తల్లితండ్రులు లోనికి వెళ్తున్న సమయంలో తమకే ఓటు వేయాలని ఇరువర్గాలు చెపుతున్న నేపధ్యంలో మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. ఇరువర్గాలు బాహబాహికి దిగడంతో విషయం తెలుసుకున్న తుంగతుర్తి సిఐ దండి లక్ష్మణ్, ఎస్‌ఐ యాదేంద్ర, అర్వపల్లి ఎస్సై మోహన్‌రెడ్డి రంగ ప్రవేశంచేసి గుంపులుగా చేరిన వారిని చెదరగొట్టారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడగా పోలీసులు చాక చక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.
ఎస్‌ఎమ్‌సి చైర్మన్ ఎన్నిక
తుంగతుర్తి: మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎస్‌ఎమ్‌సి చైర్మన్ కమిటి ఎన్నిక శుక్రవారం జరిగిందని పాఠశాల ప్రధానోపాద్యాయులు పాలవరపు సంతోష్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చైర్మన్‌గా బొంకూరి శోభ, వైస్‌చైర్మన్‌గా బోయిని లక్ష్మి ఎన్నికయ్యారని అలాగే ఏడుగురు డైరక్టర్ల ఎన్నిక జరిగిందని తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు సలీం, కళమ్మలతో పాటు తల్లితండ్రులు పాల్గొన్నారు.