నల్గొండ

పొంగిపొర్లిన వాగులు, వంకలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఆగస్టు 29: వరుణుడు కరుణించాడు...వరుణుడి కరుణతో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు నీటితో జళకళలాడుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు నీరు లేక ఒట్టిపోయి దర్శనమిచ్చిన చెరువులన్ని సోమవారం తెల్లవారు జామునుండి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మిర్యాలగూడ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సేద్యం చేసిన మెట్టపంటలతోపాటు వరిపంటలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లపై నుండి పొంగిపొర్లడంతో రోడ్లు కోతకు గురయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాతలకు శని, ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు ఊరటనిచ్చినట్లయింది. మిర్యాలగూడ డివిజన్ పరిదిలోని మిర్యాలగూడ, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, దామరచర్ల, నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద చెరువులు కుంటలు నింపేందుకు ఈనెల 25న సాగర్ ఎడమకాల్వకు నీటివిడుదల చేయక సాగర్ నీటితోపాటు కురిసిన వర్షం తోడు రావడంతో చెరువులన్ని నిండిపోయాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాలైనా వేములపల్లి, దామరచర్ల మండలాల్లో వర్షపునీటితో చెరువులు నిండుతుండగా మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి,హాలియా, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో వర్షపునీటితోపాటు సాగర్ నీటివిడుదల చేయడంతో ఆ నీరు తోడుకావడంతో చెరువులు నిండుతున్నాయి. కాగా పెద్దవూర మండలంలో ఎకెబిఆర్ ప్రాజెక్టు నుండి విడుదల చేస్తున్న నీటితోపాటు వర్షపునీరు తోడుకావడంతో ఆ మండలంలోని చెరువులు కూడా నిండి జళకళ సంతరించుకున్నాయి. వేములపల్లి మండలంలో భారీ వర్షం కురవడంతో చిత్రపరక బ్రిడ్జివాగు పొంగిపొర్లి వాగు పరివాహక ప్రాంతంలో సేద్యం చేసిన వరిపంటలతోపాటు బోరుమోటార్లు కూడా నీటమునిగిపోయాయి. అదేవిధంగా కుక్కడం చెరువు నిండి అలుగుపోస్తుండడంతో చెరువు దిగు ప్రాంతంలో ఉన్న పత్తి, వరిపంటలు నీట మునిగాయి. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో చెరువులన్నీ కూడా నిండిపోయాయి. ముఖ్యంగా ఆయకట్టు మండలమైన వేములపల్లిలోని కుక్కడం, తోపుచర్ల, చిన్నగూడెం, పుచ్చకాయలగూడెం, మొల్కపట్నం తదితర గ్రామాల్లోని చెరువులన్ని నీటితో జళకళ సంతరించుకున్నాయి. కాగా సోమవారం మిర్యాలగూడ డివిజన్‌లోని త్రిపురారంలో అత్యధికంగా 140.8మి.మీ వర్షాపాతం నమోదుకాగా పెద్దవూరలో అతిస్వల్పంగా 6.4మి.మీ వర్షాపాతం నమోదయింది. వేములపల్లిలో 128.6మి.మీ, నిడమనూరులో 39.4మి.మీ, మిర్యాలగూడలో 112.4మి.మీ, గరిడేపల్లిలో 140.6మి.మీ, హుజూర్‌నగర్‌లో 45.4మి.మీ, మఠంపల్లిలో 30.4మి.మీ, నేరేడుచర్లలో 76.2మి.మీ, దామరచర్లలో 123.6మి.మీ, అనుములలో 18.6మి.మీ వర్షపాతం నమోదయింది. కాగా వేములపల్లి మండలంలో సేద్యం చేసిన పత్తి, కంది పంటలలోకి నీరు వచ్చి నిలిచింది. దీంతోపాటు బత్తాయి తోటలో కూడా నీరు నిలిచింది. గత మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనారు.