నల్గొండ

దేవాలయాల పునరుద్ధరణపై.. సిఎం ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 2: దేవాలయాల పునరుద్ధరణ పట్ల సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నింటినీ అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రణాళిబద్ధంగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమవాస్య నిద్రచేసి శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కోడె మొక్కును చెల్లించుకున్నారు. సీఎం కెసిఆర్ కలలుకంటున్న బంగారు తెలంగాణ సాకారం కావాలని స్వామిని కోరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు అన్ని మతాల అభివృద్ధికి సీఎం కెసిఆర్ చిత్తశుద్ధితో సహకారం అందిస్తున్నారన్నారు. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను 950 కోట్ల ఖర్చుతో దేశంలోనే అద్భుత దర్శనీయ దివ్య పుణ్యక్షేత్ర నగరంగా అభివృద్ధి చేసేందుకు కెసిఆర్ సంకల్పించారన్నారు. యాదగిరిగుట్టను దేశంలోనే ప్రత్యేకంగా నిలిపేందుకు యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ప్రతి రోజు యాదాద్రి దేవస్థాన అభివృద్ధి పనులపై కెసిఆర్ సమీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేసి, ఆదాయ వనరులు పెంపొందిస్తూ వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. చెర్వుగట్టును కూడా తెలంగాణ శ్రీశైలంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికే చెర్వుగట్టు అభివృద్ధిపై సీఎం వద్ద చర్చలు జరిగాయని త్వరలోనే కెసిఆర్ దేవాలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు ప్రకటించనున్నారన్నారు. నూతనంగా ఏర్పాటు జరిగే యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట, నల్లగొండ జిల్లాలో చెర్వుగట్టులను దివ్య క్షేత్రాలుగా తీర్చిదిద్ధనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.