నల్గొండ

చేనేత సంఘాన్ని ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, మార్చి 27: తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని అన్ని విధాల ఆదుకుంటామని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైద్రాబాద్‌లోని ఆయన స్వగృహంలో టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన చేనేత సంఘ డైరక్టర్లు అంకం మురళి, సీస చక్రపాణి, సిద్దుల రామచంద్రం, గంజి అంజయ్య, భారత భారతమ్మ, అంకం యాదగిరిలు ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిటీసి ప్రభాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కందాటి భూపాల్‌రెడ్డి, నాయకులు రావుల శేఖర్‌రెడ్డి, రవీందర్, మధు, చంద్రం యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.