నల్గొండ

ఆర్యవైశ్యులు సేవా భావాన్ని పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, సెస్టెంబర్ 8: ఆర్యవైశ్యులంటేనే సేవా గుణానికి నిదర్శనమని అయితే ఆర్యవైశ్యులు మరింత సేవాభావాన్ని పెంపొందించుకొని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య కోరారు. నల్లగొండ జిల్లా ఆర్యవైశ్యమహాసభ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణం లోని వైష్ణవి ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులంటే ఆర్థికంగా స్థిరపడ్డ వారన్న పేరుందని అయితే వైశ్యులలో కూడా కడు పేదరికంతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఆర్థ్ధికంగా వెనుకబడ్డ ఆర్యవైశ్యులకు సాయం చేయడం ఎంత ముఖ్యమో సమాజంలో వెనుకబడ్డ అన్ని వర్గాల ప్రజలను కూడా ఆదుకునేందుకు ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ముందుకు రావాలని రోశయ్య సూచించారు. నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పానుగంటి మల్లయ్యను రోశయ్య అభినందించారు. మల్లయ్య నాయకత్వంలో జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ మరింత బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మల్లయ్యతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. తాను 1975 వ సంవత్సరంలో దేవరకొండకు వచ్చానని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దేవరకొండ పట్టణానికి వచ్చానని ఆయన చెప్పారు. సాగర్ నీటి రాకతో మిర్యాలగూడలో రైస్ ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందిందని రోశయ్య అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల వేల సంఖ్యలో రైస్‌మిల్లులు మూతపడ్డాయని దీని వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయి వీధిన పడాల్సిన దుస్ధితి నెలకొందని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూసిన మిల్లులు తిరిగి తెరిపించేలా తగు చర్యలు తీసుకోవాలని రోశయ్య వేదికపై ఉన్న హోంమంత్రి నాయినిని కోరారు.
ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యతను కల్పించేందుకు టిఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులంటేనే సేవాగుణం ఉండే వారన్న పేరుందని అన్నారు. జిల్లాలో మూతపడ్డ రైస్‌మిల్లులను తిరిగి తెరిపించేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించి మూసిన మిల్లులను తిరిగి తెరిపించేలా చర్యలు తీసుకుంటానని నాయిని నర్సింహ్మారెడ్డి చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన పానుగంటి మల్లయ్యను హోంమంత్రి నాయిని అభినందించారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులను రాజకీయంగా ఆదరించింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. వేదిక మీద ఉన్న రోశయ్యనే అందుకు సాక్ష్యమన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన రోశయ్యను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా నియమించిందని గుర్తు చేశారు. జిల్లా ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన పానుగంటి మల్లయ్యను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, జిల్లా పరిషత్‌చైర్మెన్ నేనావత్ బాలూనాయక్, నగరపంచాయతి చైర్మన్ మంజ్యానాయక్, జడ్పీటీసి నర్సింహ్మ, ఆర్యవైశ్య మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు పానుగంటి మల్లయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌నారాయణ, రాష్ట్ర ఆర్యవైశ్యమహాసభ ప్రచార కార్యదర్శి ఆర్‌విటి, దేవరకొండ మండల ఆర్యవైశ్యసంఘం కోశాధికారి జంగయ్య, పట్టణ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు పాండరయ్య, ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి భరతయ్య, వాసవి కళ్యాణమండపం గౌరవ అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి మురళి, కోశాధికారి భద్రయ్య, వాసవి క్లబ్ అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి పుల్లయ్య, ఆర్యవైశ్యసంఘం నాయకులు గార్లపాటి దామోదర్, శ్రీనివాస్, పానుగంటి తదితరులు ఉన్నారు.