నల్గొండ

పాలేరు పనులు త్వరగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మిషన్‌భగీరథ పనుల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, సూర్యాపేటకు మంచినీటిని అందించే పాలేరు పథకం పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పాలేరు పథకం పనులపై నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ప్రజలకు మంచినీటిని అందించేందుకు రూ.72కోట్ల అంచనా వ్యయంతో పాలేరు మొదటి దశ పనులను చేపట్టినట్లు చెప్పారు. ఇట్టి పనులను సత్వరమే పూర్తిచేయకుంటే ప్రభుత్వం నిధులు ఇచ్చిన ప్రయోజనం ఉండదన్నారు. మిషన్‌భగీరథ పనుల వేగాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇమాంపేట వద్ద నిర్మిస్తున్న డబ్ల్యుటిపి పనులను సైతం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇట్టి పనులపై ఈనెల 15వ తేదీన క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని గొల్లబజార్‌లో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పనులను రాత్రి పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు నిర్మాణాలు పాటిస్తూ నిర్మిస్తున్న ఇళ్లు ఎక్కువ కాలం నిలిచేలా, రాష్టవ్య్రాప్తంగా ఆదర్శంగా ఉండే విధంగా చూడాలన్నారు. పనులు చేపట్టిన సాయి నిర్మాణ సంస్థ శరవేగంగా పనులు చేపడుతుందని, పనులను మరింత వేగవంతం చేసి పేదల సొంతింటి కలను అతిత్వరలో సాకారం చేయాలన్నారు. రాజీవ్‌నగర్‌లో గల స్మశానవాటికలో కనీస వౌలికసదుపాయాలు కల్పించేందుకు వెంటనే నిధులు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, కమిషనర్ వడ్డె సురేందర్, తహశీల్దార్ మహమూదు అలీ, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, తాహేర్, వల్దాస్ దేవేందర్, టిఆర్‌ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్, గండూరి ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.