నల్గొండ

సాగర్‌లో అఖిలపక్షం రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 12: నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా పూర్తిస్థాయిలో గుర్తించాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో గత 20రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పాత పోలీస్‌స్టేషన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సాగర్ సమీపంలోని తండాల నుండి వందల సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. వీరితోపాటు స్థానిక సమభావన సంఘాల మహిళలు, పాఠశాల విద్యార్థ్ధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో గంటసేపు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా రోడ్డుపైనే ఏర్పాటుచేసిన సమావేశంలో అఖిలపక్షం నాయకులు రమేశ్‌జి, కూన్‌రెడ్డి నాగిరెడ్డిలు మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా చేయడానికి ప్రతిపాదనలు వెళ్లగా కొంతమంది సాగర్‌లో నివాసం ఉంటూ ఇతర మండలాలకు చెందిన వారు సాగర్‌ను మండల కేంద్రంగా చేయకుండా కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగనివ్వమన్నారు. ఒక మండల కేంద్రంకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలు నాగార్జునసాగర్‌లో ఉన్నాయని దీనికై చుట్టుపక్కల తండాలను కలుపుకోని 40వేల జనాభా ఉన్న నాగార్జునసాగర్‌ను మండల కేంద్రంగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు జానారెడ్డి మిగతా రాజకీయపార్టీల నాయకులు పార్టీలకతీతంగా నాగార్జునసాగర్ మండల కేంద్రం అయ్యే విషయంలో ఐక్యంగా ముందుకు సాగాలని వారు కోరారు. సాగర్‌ను మండల కేంద్రంగా చేయకపోతే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బషీర్, చంద్రవౌలి, వీరయ్య, కృష్ణ, సుధీర్, శేఖరాచారి, మల్సూర్, జహంగీర్, శ్రీనునాయక్, మునినాయక్, రామచంద్రయ్య, విక్రం, కొండలు, వెంకటకోటయ్య, సర్పంచ్‌లు చంద్రయ్య, తారాసింగ్, కొండలు, శ్రీను, హచ్చునాయక్, ధర్మానాయక్, రమేశ్‌గౌడ్‌లు పాల్గొన్నారు.