నల్గొండ

గతం ఘనం.. భవిష్యత్ అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 27: నల్లగొండ జిల్లాలో టిడిపి పార్టీ ప్రస్థానం గతమెంతో ఘనకీర్తి..్భవిష్యత్ ఆయోమయమన్నట్లుగా మారిపోగా తెలుగు తమ్ముళ్లు పార్టీ పరిస్థితిపై తీవ్ర నైరాశ్యంలో పడిపోయారు. ఈ నెల 29న టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోవాల్సిన తెలుగు తమ్ముళ్లు జిల్లాలో తమ పార్టీ బలహీన పడిన తీరును తలుచుకుంటు తెలంగాణలో తమ పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందో రాదోననుకుంటు దిగులు పడుతున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న జిల్లాలో ఆ పార్టీలకు ధీటుగా ఎమ్మెల్యేలను గెలిచి పసుపు పతకాన్ని సగర్వంగా ఎగురేసి టిడిపి ప్రభుత్వాల్లో జిల్లా నుండి దివంగత నేత ఎ. మాధవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డిలు మంత్రి పదవులను సైతం నిర్వహించారు. ఆకారపు సుదర్శన్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో ఒక వెలుగు వెలిగిన టిడిపికి వైఎస్సార్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్‌లో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి వలసతో పతనం మొదలై, తదనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉదృతి, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య బలహీన పడుతు వచ్చింది. గత ఎన్నికల్లో ఒక్క ఎంపి, ఎమ్మెల్యే సీటు గెలువలేక టిడిపి జిల్లాలో పూర్తిగా ఢీలా పడింది. టిఆర్‌ఎస్ చేపట్టిన ఆకర్ష్‌తో జిల్లాలో గెలిచిన టిడిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం భారీగా టిఆర్‌ఎస్‌లోకి వలస పోవడం ఆ పార్టీని మరింత బలహీన పర్చింది. దీనికి తోడు అసలే ప్రజాదరణ తరిగి ఇబ్బందుల్లో పడిన పార్టీలో సీనియర్లు మోత్కుపల్లి నరసింహులు, ఉమామాధవరెడ్డి వర్గాల మధ్య గ్రూపు తగాదాలు పార్టీని మరింత నిస్తేజంగా మార్చాయి. పరస్పరం ఇరువర్గాలు చంద్రబాబుకు ఫిర్యాదులు సైతం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఉమామాధవరెడ్డితో పాటు ఆమె వర్గం పార్టీ కార్యకలాపాల్లో మునుపటి ఉత్సాహంతో ముందడుగు వేయడం లేదు.
భవిష్యత్ భారం వారిద్ధరిపైనే !
తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల నాయకులకు రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో స్థానం కల్పించారు. మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డిలను పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. పార్టీ నుండి పోయినోళ్లు పోగా మిగిలిన ఈ ఇద్దరి సీనియర్లపైనే పార్టీ భవిష్యత్ భారం పడింది. అయితే పార్టీ కార్యకలాపాల్లో మాత్రం మోత్కుపల్లి నరసింహులు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటాన్ని ఉమా వర్గం ప్రతిఘటిస్తునే ఉంది. యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలంటు మోత్కుపల్లి పార్టీ పరంగా ఆందోళనలు నిర్వహిస్తు తన పాత నియోజకవర్గం ఆలేరు పరిధికే పరిమితమవ్వడం జిల్లాలో పార్టీ విస్తరణకు ప్రతికూలంగా మారింది. జిల్లా స్థాయిలో పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని రగిలించేలా ఆయన పర్యటనలు, కార్యక్రమాలు ఉండటం లేదు. తనకు ఎలాగు తప్పదన్నట్లుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు బిల్యానాయక్ అడపదడపా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దేవరకొండ నియోజవర్గంలో పార్టీ మనుగడకు కృషి చేస్తున్నారు. ఉమామాధవరెడ్డి సైతం మోత్కుపల్లి తరహాలోనే తన భువనగిరి నియోజకవర్గంకే పరిమితమయ్యారు. జిల్లాలో తీవ్ర కరవు నెలకొనడం, రైతు సమస్యలు అధికమవ్వడం, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి పనుల్లో లోటుపాట్లపై ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనలు సాగిస్తున్నా టిడిపి నుండి మాత్రం జిల్లా స్థాయిలో ప్రజాందోళనలను నిర్మాణం సాగడం లేదు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్న బండ్రు శోభారాణి సైతం ఆలేరు నియోజకవర్గం పరిధిలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికార ప్రతినిధి పాల్వాయి రజనికుమార్ అటు తుంగతుర్తి, ఇటు నకిరేకల్ నియోజకవర్గాల్లో ఎక్కడా పార్టీని బలోపేతం చేయలేక గందరగోళంలో పడింది. కోదాడ నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లం మల్లయ్యయాదవ్, సూర్యాపేట నుండి పటేల్ రమేష్‌రెడ్డి, సాగర్ నుండి కడారి అంజయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, మునుగోడులో జక్కుల ఐలయ్య యాదవ్‌లు సైతం అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు సాగిస్తు పార్టీ ఉనికిని చాటుతున్నారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వంగాల స్వామిగౌడ్ హుజూర్‌నగర్ ఇన్‌చార్జిగా ఉన్నా ఎన్నికల పిదప అక్కడ నామమాత్రంగా పార్టీ కార్యకలాపాల్లో హాజరవుతున్నారు. చావ్లా కిరణ్మయి సైతం ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరించలేపోతుంది. మిర్యాలగూడలో బంటు వెంకటేశ్వర్లు, ఎండి.యూసఫ్, సాధునేని శ్రీనివాస్‌రావు, మునుగోడులో కాశీనాథ్‌లు సైతం గతంలో మాదిరిగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడంతో క్యాడర్‌లో నిస్తేజం నెలకొంది. ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వం హవా సాగుతున్న పరిస్థితుల్లో తాము వ్యయప్రయాసాలతో పార్టీని నడిపించినా రాజకీయంగా భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదన్న నైరాశ్యం తెలుగుతమ్ముళ్లలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం 29వ తేది పిదప 30వ తేదిన టి.టిడిపి ముఖ్యులతో చంద్రబాబు సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం పిదపనైనా మోత్కుపల్లి, ఉమాలు జిల్లాలో గతంలో మాదిరిగా సైకిల్ పరుగుకు పూర్వవైభవం తెస్తారో లేదోనని తెలుగుతమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.