నల్గొండ

భక్తి శ్రద్ధలతో బక్రీద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 13: బక్రీద్ పర్వదినాన్ని ముస్లీం సోదరులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, భువనగిరి, సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ, నకిరేకల్, చౌటుప్పల్, ఆలేరు, మునుగోడు తదితర ప్రాంతాల్లో బక్రీద్ ప్రార్థ్ధనల్లో వేలాది మంది ముస్లీంలు చిన్నా పెద్ద అంతా పాల్గొని పరస్పరం ఈద్‌ముబారక్‌లు తెలుపుకున్నారు. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రముఖులు ముస్లీంలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హిందుముస్లీంల బక్రీద్ ఈద్‌ముబారక్‌లతో మతసామరస్యం వెల్లివిరిసింది. నల్లగొండలోని ఈద్గా వద్ధ వేలాది మంది ముస్లీంల బక్రీద్ ప్రార్ధనల పిదప కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్,సిపిఎం, టిడిపి నేతలు దుబ్బాక నరసింహరెడ్డి, నంద్యాల నరసింహరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డిలు, ఆర్డీవో వెంకటాచారి ప్రభృతులు ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ముస్లీం పెద్ధలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపగా వారు ఆయనను సత్కరించారు. భువనగిరి, నకిరేకల్‌లో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, మిర్యాలగూడలో ఎన్. భాస్కర్‌రావులు ముస్లీంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.