నల్గొండ

వర్షాల జోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 15: జిల్లాలో వర్షాల జోరు గురువారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 59మండలాల్లో ముసురు వర్షాలు, భారీ వర్షాలు కురువగా జిల్లాలో సగటున 18.9మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. మూసీ నది పొంగి భూదాన్ పోచంపల్లి-బీబీనగర్ మండలాల మధ్య రోడ్ కాజ్‌వేల మీదుగా ప్రవహించడంతో బట్టుపల్లి, రుద్రవెల్లి, పెద్దరావులపల్లి, బీమనపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కల్గింది. పోచంపల్లి పెద్ద చెరువు అలుగు నీరు రోడ్ల మీదుగా సాగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాల్‌పూర్‌లో వర్షాలకు ఓ పెంకుటిల్లు కూలింది. బీబీనగర్ మండలం బ్రహ్మణవెల్లి వద్ద బునాదిగాని కాలువకు గండి పడింది. రాయరావుపేట గుట్టల వరద నీరు సమీపంలోకి కోళ్ల పెంపకం షెడ్‌లలోకి ప్రవహించడంతో 7వేల కోళ్లు మృతిచెందాయి. కేతెపల్లి బొప్పారం చెరువు అలుగు నీటి ఉద్ధృతికి 200ఎకరాల పంటలు మునిగాయి. కేతెపల్లి మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645అడుగులకుగాని 643అడుగులకు చేరగా గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ వరద ఉద్ధృతికి ప్రాజెక్టులో 13,500క్యూసెక్కుల నీరు చేరింది. పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుండగా ప్రాజెక్టులో నీటి మట్టం 23టిఎంసిలకు చేరింది. ఇన్‌ఫ్లో 21,500క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11,900క్యూసెక్కులుగా ఉంది. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది వరద ఉద్ధృతి పెరుగడంతో అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దేవరకొండ, మిర్యాలగూడ, బీబీనగర్, నేరడుచర్ల, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో పలు చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి.
వర్షపాతం వివరాలు
మండలాల్లో సగటున 18.9మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా పోచంపల్లిలో 78.2, బీబీనగర్‌లో 66.4, భువనగిరిలో62.2, బొమ్మలరామారంల 55.4, ఆలేరులో 45, సూర్యాపేటలో 35.8, యాదగిరిగుట్టలో 35.2మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. తుర్కపల్లిలో 34.2, మోతేలో 32.8, మునగాలలో 32.6, త్రిపురారంలో 32.4, నడిగూడెంలో 31.6, హుజూర్‌నగర్‌లో 28.4, చిలుకూరులో 24.4, దామరచర్లలో 24, తుంగతుర్తిలో 23.8, చివ్వెంలలో 23.4, కేతెపల్లిలో 22.6, ఆత్మకూర్(ఎస్)లో 22.4, కోదాడలో 21.6, వేములపల్లిల 19.2, రాజాపేటలో 18.6, గుండాలలో 18.4, మిర్యాలగూడలో 17.4, నిడమనూర్‌లో 16.4, గరిడేపల్లిలో 15.8, నూతనకల్‌లో 15.4, మేళ్లచెర్వులో 14.6, అర్వపల్లిలో 14.2, నేరడుచర్లలో 12.6, పెద్ధవూరాలో 12.4, పెన్‌పహడ్‌లో 12.2, కనగల్‌ళో 12, హాలియాలో 12, మఠంపల్లిలో 11, మునగాలలో 9, ఆత్మకూర్(ఎం)లో 8.6, మోత్కూర్‌లో 7.6, నకరేకిల్‌లో 7.4, గుర్రంపోడులో 7.2, తిప్పర్తిలో 6.4, చండూర్‌లో 6.4, చౌటుప్పల్‌లో 5.4, శాలిగౌరారంలో 5.4, నల్లగొండలో 4.6, మర్రిగూడలో 4.6, తిరుమలగిరిలో 4.6, నాంపల్లిలో 4, డిండిలో 3.4, వలిగొండలో 3.2, పిఏపల్లిలో 3.2, రామన్నపేటలో 3, కట్టంగూర్‌లో 2.6, చింతపల్లిలో 2.2, చందంపేటలో 2.2, దేవరకొండలో 2, నార్కట్‌పల్లిలో 1.4, చిట్యాలలో 1.0, నారాయణపూర్‌లో 1.0మిల్లిమీటర్లు నమోదైంది.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మూసీ
* స్తంభించిన రాకపోకలు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 : హైద్రాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు మండలంలో ప్రవహించే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షాలకు మండలంలోని పెద్దరావులపల్లి, జూలురు, భీమనపల్లి వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోచంపల్లి నుంచి చౌటుప్పల్‌కు వెళ్లేందుకు పరిసర గ్రామ ప్రజలు చుట్టు తిరిగి వెళ్లారు. మూసిని దాటించేందుకు కొంతమంది వాహనదారులు, ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేశారు. పోచంపల్లి పెద్దచెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దిగువనున్న వరి పొలాలు నీట మునిగాయి. గ్రామాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంది.
పదవ ర్యాంకు సాధించిన రూపేశ్
మిర్యాలగూడ, సెప్టెంబర్ 15: ఎంసెట్-3 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన వెంపటి రూపేశ్ మెడిసిన్ విభాగంలో పదవ ర్యాంకు సాధించాడు. పదవ తరగతి వరకు మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని శ్రీప్రకాశ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సిబిఎస్‌ఇలో విద్యనభ్యసించి 10జిపిఎ సాధించాడు. ఇంటర్ మొదటిసంవత్సరం విజయవాడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించి 433మార్కులు సాధించగా ద్వితీయ సంవత్సరం శ్రీచైతన్యనారాయణ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించి 454మార్కులు సాధించాడు. మొత్తం ఇంటర్మీడియట్‌లో 987/1000మార్కులు సాధించాడు. అయితే ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-1లో 1071ర్యాంకు, ఎంసెట్-2లో 157వ ర్యాంకు సాధించాడు. ఎంసెట్-3లో 150/160మార్కులు సాధించి రాష్టస్థ్రాయిలో పదవ ర్యాంకు పొందాడు. నీట్‌లో 987వ ర్యాంకు, ఎపి ఎంసెట్‌లో 1320ర్యాంకు సాధించాడు.
న్యూరోసర్జన్ కావాలని ఉంది...రూపేశ్:-
గాంధి మెడికల్ కాలేజిలో ఎంబిబిఎస్ చేయాలని కోరుకుంటున్నట్లు పదవ ర్యాంకు సాధించిన రూపేశ్ ఈ విలేఖరితో మాట్లాడుతూ అన్నారు. ఎంబిబిఎస్ పూర్తయిన తరువాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో న్యూరోసర్జన్ చేయాలని ఉందని వెంపటి రూపేశ్ వెల్లడించారు. కళాశాల లెక్చరర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే తాను ఈ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. పేదలకు వైద్యారోగ్య సేవలందించేందుకు తనవంతు కృషిచేస్తానని ఆయన అన్నారు.
ఎంసెట్-3 వరంగా మారింది...
రూపేశ్ తండ్రి వెంపటి వాసు:- ఎంసెట్-3 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనంతరం తాము, తన కుమారుడు మానసికంగా ఇబ్బందిపడ్డామని తల్లిదండ్రులు వెంపటి వైకుంఠవాసు, మంగ పేర్కొన్నారు. రెండుసార్లు నిర్వహించిన ఎంసెట్‌లో ర్యాంకులు క్రమ పద్దతిలో పెరుగుతూ వచ్చాయని, మూడవ ఎంసెట్‌లో తన కుమారుడి కష్టానికి ఫలితం దక్కిందని వారు అన్నారు. అంతా దైవకృప అని వారు పేర్కొన్నారు. తమ కుమారుడికి పదవ ర్యాంకు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

రైతు వ్యతిరేకి కెసిఆర్ ప్రభుత్వం
రైతాంగ సమస్యలపై టిడిపి పోరు దీక్ష * పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, సెప్టెంబర్ 15: సీఎం కెసిఆర్ ప్రభుత్వం రైతుల వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెటుతోందని టిడిపి జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యానాయక్ ఆరోపించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తు ఈ నెల 19,20 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద టిడిపి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల రైతుపోరు దీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో వరుసగా రెండో ఏడాది కూడా కరవుతో రైతులు పంటనష్టం పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతుల రుణమాఫీ మూడో విడత నిధులు బ్యాంకర్లకు జమచేయని ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన కరవు ఇన్‌ఫుట్ సబ్సిడిని సైతం పంపిణీ చేయకుండా రైతులను ఆర్థికంగా మరింత ఇబ్బందుల పాలు చేసిందన్నారు. ఆత్మహత్యల పాలైన రైతుకుటుంబాలకు 6లక్షలు ఇస్తామని కేవలం లక్షన్నర మాత్రమే చెల్లించారని, జిల్లాలో 300మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 75మందికి మాత్రమే ఎక్స్‌గేషియా అందించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పేరుతో భారీగా భూసేకరణ చేస్తు రైతులను రోడ్డున పడేస్తున్నారని, డిండి ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కెసిఆర్ ఈ పథకాన్ని రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని, మార్కెట్ ధరకు నాలుగురెట్లు అదనంగా పరిహారం, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని చెప్పి నేడు ఎకరాకు 123జీవోతో 4లక్షల 15వేల రూపాయలు మాత్రమే చెల్లించి అన్యాయం చేస్తున్నారన్నారు. 2013్భసేకరణ చట్టం మేరకే భూనిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని, రుణమాఫీ ఒకేసారి చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 6లక్షల పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లతో టిడిపి రైతు దీక్షలు చేయనుందన్నారు. ఈ దీక్షలకు టిడిపి శ్రేణులు, ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కంచర్ల భూపాల్‌రెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద్, బంటు వెంకటేశ్వర్లు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వివిధ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పెద్దిరెడ్డి రాజా, ఎండి.యూసఫ్, సాధుశ్రీనివాస్, మాదగోని శ్రీనివాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బాబురావునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసెట్-3లో సాయికుమార్‌రెడ్డికి 167వ ర్యాంకు
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 15: తెలంగాణ ఎంసెట్-3పరీక్షలో నల్లగొండ ఆర్టీసీ కాలనీకి చెందిన యానాల సాయికుమార్‌రెడ్డికి 167వ ర్యాంకు సాధించాడు. సాయికుమార్‌రెడ్డి ఏపి ఎంసెట్‌లో 241వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్ -1లో 484వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్-2లో 407వ ర్యాంకు సాధించగా ఈ దఫా తెలంగాణ ఎంసెట్-3లో మరింత మెరుగ్గా 167వ ర్యాంకు సాధించడం గమనార్హం. సాయికుమార్‌రెడ్డి ఎంసెట్-3లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యానాల ప్రభాకర్డ్డ్రెరాధిక, కుటుంబ సభ్యులు, ట్రస్మా నాయకులు, మమత పాఠశాల నిర్వాహకులు అభినందనలు తెలిపారు.
ఘనంగా ఇంజనీర్స్ డే
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 15 : పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు ఆయా కార్యాలయాల్లో గురువారం మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయితీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంపాల సత్యనారాయణరెడ్డి, టిఎన్‌జిఒస్ నాయకులు రాంబాబు, పి ఆర్ ఆర్‌డబ్ల్యు ఎస్ డి ఈ నాగయ్య, ఏ ఈలు, ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఎబివిపి ఆధ్వర్యంలో
ఎంజియు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జిల్లా టెక్నికల్ సెల్ కన్వీనర్ పెసర సాయికుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిలోకం మోక్షగుండం విశే్వశ్వరయ్య ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కుంభం శివకుమార్, ఇంజనీరింగ్ కళాశాలల అధ్యక్షులు నాగరాజు, వీరమల్ల నాగరాజు, గోపి, పవన్‌కుమార్, మోహన్, రోహిత, వీన, గోపినాద్, మనోజ్, పాల్గొన్నారు.
ముస్తాబవుతున్న సూర్యాపేట
* దసరా నుంచి పాలన ప్రారంభం * కార్యాలయాల ఎంపిక పూర్తి
* జిల్లాకు 2,824 మంది ఉద్యోగులు * కొత్తగా 1,273 పోస్టులు
సూర్యాపేట, సెప్టెంబర్ 15: కొత్త జిల్లాలు కొలువుదీరేందుకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రప్రభుత్వం వేగవంతం చర్యలు చేపడుతోంది. దసరా నుండి పరిపాలన ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. నూతన జిల్లా కార్యాలయాల ఏర్పాటుకోసం భవనాల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఉద్యోగుల విభజన, నూతన పోస్టుల మంజూరు ప్రక్రియ సైతం గురువారం ఓ కొలిక్కి వచ్చింది. సూర్యాపేట జిల్లాకు 1,551మంది ఉద్యోగులను కేటాయించగా 1,273 వివిధ శాఖల పోస్టులను నూతనంగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త జిల్లాకు సంబంధించి ఫైళ్ల విభజన మరో మూడు, నాలుగురోజుల్లో పూర్తికానుందని అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్ ఏర్పాటుకోసం దురాజ్‌పల్లిలో గల కామాక్షి ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని ఖరారుచేయడంతో పాటు ఆ భవనంలో శాఖల వారీగా జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి 32గదులను సైతం కేటాయించారు. ఆయా శాఖల కార్యాలయాలకు అవసరమైన ఫర్నిచర్‌ను ఏర్పాటుచేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. 65వేల చదరపు గజాలు ఉన్నా కలెక్టరేట్ భవనంలోనే 25 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటుచేస్తున్నారు. సివిల్ సప్లైయిస్, డిఆర్‌డిఎ, డ్వామా, వ్యవసాయ, జిల్లా పంచాయితీ కార్యాలయం, జిల్లా పౌరసంబంధాల అధికారి, డిటివో, డిఎస్‌వో, ఆడిట్, కార్మిక, గృహనిర్మాణ, అటవీ, ప్రణాళిక విభాగం తదితర శాఖల కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటుచేస్తున్నారు. పట్టణంలో విద్యుత్, ఎక్సైజ్, మార్కెట్, జిల్లా వైద్యఆరోగ్య అధికారి కార్యాలయం, రవాణ, వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలను పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను ఎంపికచేశారు. మరోవైపు జిల్లా పోలీస్ కార్యాలయం కోసం గుర్తించిన ఇండోర్ స్టేడియం భవనాన్ని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకొని నూతన జిల్లా పోలీస్ కార్యాలయం బోర్డును ఏర్పాటుచేయడంతో పాటు బందోబస్తును ఏర్పాటుచేశారు. పట్టణంలోని వాణిజ్యభవన్ సమీపంలో గల రెండు ఇళ్లను అద్దె ప్రాతిపదికన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ బంగ్లాలుగా నిర్ణయించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గతంలో నివసించిన వైట్‌హౌజ్ భవనాన్ని జెసి బంగ్లాగా, దాని పక్కనే ఉన్న మరో భవనాన్ని కలెక్టర్ బంగ్లాగా గుర్తించి ఆయా భవనాల్లో ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ నివాస భవనం గుర్తించాల్సి ఉంది. ఇందుకోసం స్థానిక డిఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న కృష్ణవేణి అతిధి గృహంతో పాటు విజయకాలనీలోని ప్రైవేట్ భవనాన్ని పరిశీలిస్తున్నారు. పోలీస్ ఉద్యోగుల విభజన మాత్రం దసరా తర్వాతే జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త జిల్లాకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీల నియామకం మరో వారంరోజుల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ 11న విజయదశమి నుండి అధికారికంగా పరిపాలన ప్రారంభించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.