నల్గొండ

అదనపు కృష్ణానీటికి ఒత్తిడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 19: నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఖరీఫ్ పంటల పరిరక్షణకు కృష్ణా నీటి సాధనకు జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులు క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సెప్టెంబర్ నెల జిల్లా సాగుతాగునీటి అవసరాల కోసం ఇప్పటికే 12టిఎంసిలకు కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతినిచ్చింది. ఆక్టోబర్ నెల సాగుతాగునీటి అవసరాల కోసం మరో 15టిఎంసిలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. నిజానికి వరుసగా రెండో ఏడాది కూడా వర్షాభావంతో సాగర్ రిజర్వాయర్‌లో తగిన నీటి నిల్వలు లేక ఆయకట్టు రైతులకు నీటి విడుదలకు అవకాశం లేకపోవడంతో వారు రెండు పంటలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్‌లో కనీసం ఆరుతడి పంటలకైన విడతల వారీగా నల్లగొండ-ఖమ్మం జిల్లాల పరిధిలోని ఒకటి, రెండో జోన్‌ల పరిధిలోని 2.50లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మూడు నెలలకు ఎడమకాలువ ఆయకట్టుకు 31టిఎంసిలు, నల్లగొండ తాగునీటి అవసరాలకు 4.1టిఎంసిలు, హైద్రాబాద్ తాగునీటి అవసరాలకు 6టిఎంసిలు అవరసమని బోర్డును కోరింది. సెప్టెంబర్ నెల అవసరాలకు బోర్డు సైతం 12టిఎంసిలకు విడుదలకు అనుమతినివ్వడంతో ఇప్పటికే పలు దఫాలుగా సాగర్ ఎడమకాలువకు, ఇతర తాగునీటి అవసరాలకు నీటి విడుదల జరిపారు. ఇక ఆక్టోబర్ నెలకు కావాల్సిన 13టిఎంసిలు కూడా విడుదలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం బోర్డును కోరుతు తాజాగా మరో లేఖ పంపింది. సాగర్, శ్రీశైలంలలో ప్రస్తుతం కనీస నీటి మట్టాలపైన 53టిఎంసిల నీటి లభ్యత ఉన్నందున ఆక్టోబర్ నెల సాగుతాగునీటి అవసరాలకు సాగర్ నుండి తెలంగాణకు 13టిఎంసిలు కేటాయించాలని ప్రభుత్వం కోరింది. జూరాలకు ఇన్‌ఫ్లో మెరుగ్గా ఉన్నందున శ్రీశైలం నుండి సాగర్‌కు నీటి విడుదలకు సానుకూల అంశంగా కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో కృష్ణా బోర్డు సానుకూలంగా స్పందించి ఆక్టోబర్ నెలకు కూడా 13లేదా 12టిఎంసిల నీటిని విడుదల చేస్తే సాగర్ ఎడమకాలువ పరిధిలో సాగవుతున్న ఖరీఫ్ పంటల మనగడకు ఢోకా ఉండదన్న ధీమా రైతాంగంలో వ్యక్తమవుతుంది.