నల్గొండ

వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లాను అల్పపీడన వర్షాలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా, వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడా అన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తుండగా సగటు 89.4మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. గురువారం రాత్రి నుండి మొదలుకుని శుక్రవారం రాత్రి వరకు కూడా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు నిరంతరాయంగా ఎడతెరపిలేకుండా కురుస్తుండగా జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లా పరిధిలోని మూసీ నది ఉప్పొంగగా, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లాయి. వరదల ధాటికి పల్లె, పట్నం తేడా లేకుండా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమవ్వగా డ్రైనేజీలు పొంగి పొర్లాయి. మండలాల్లో విద్యుత్ సరఫరాకు గంటల తరబడిగా అంతరాయం ఏర్పడింది. నిరంతర వర్షాలతో జనం ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితుల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చిరువ్యాపారుల, దుకాణాదారుల వ్యాపారాలు స్తంభించాయి. మోత్కూర్ మండలంలో బొడ్డుగూడెంలో వర్షానికి ఇల్లు కూలీ సప్పిడి మణెమ్మ(70) మృతి చెందగా, నాంపల్లి మండలంలో గానుగుబెల్లి చెరువులో పడి మానాల సాయికుమార్ (16) మృతి చెందాడు. గుండాల మండలంలో గురువారం రాత్రి పెద్దపడిశాలలో వస్తాకొండురు వాగులో చేపల పట్టేందుకు వెళ్లిన నలుగురు యువకులు ఒక్కసారిగా వాగు వరద ఉదృతి పెరిగి వాగు మధ్యలో చిక్కుకోగా శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు వారిని గ్రామస్తులు రక్షించారు. భూదాన్ పోచంపల్లి మండలంలో 19ఇండ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా కూలిపోయింది. జిబ్లక్‌పల్లి, కనుముక్కుల, బీమనపల్లి, రేవన్‌పల్లి, పోచంపల్లి గ్రామాల పరిధిలో వరద ఉదృతికి 170ఎకరాల వరి పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్ధరావులపల్లి, రుద్రవెల్లి, జూలురు, పిల్లాయిపల్లి రోడ్ కాజ్‌వేల మీదుగా మూసీ పరవళ్లు తొక్కడంతో ఆ గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
బీబీనగర్, వలిగొండ మండలాల్లో బ్రాహ్మణవెల్లి, బట్టుగూడెం కాజ్‌వేల మీదుగా, సంగెం కాజ్‌వే మీదుగా మూసీ ఉప్పొంగగా రాకపోకలు స్తంభించాయి. మోత్కూర్-వలిగొండ, దాసిరెడ్డిగూడెం, సుంకిశాల కాజ్‌వే మీదుగా వరద పొటెత్తింది. 200ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నాగారం, జాలుకాలువ గ్రామాల్లో కల్వర్టుల వద్ధ రోడ్లు కొట్టుకపోగా రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సుంకిశాలలో 10ఇల్లు కూలిపోయాయి. ఆలేరు మండలంలో పదేళ్ల పిదప గంథమల్ల చెరువు జలకళ సంతరించుకుంది. రాజాపేట, తుర్కపల్లి చెరువులు, కుంటలు నిండి అలుగు పోశాయి. కట్టంగూర్‌లో మూసీ అసఫ్ నహర్ కాలువ పొంగి, బీమనపల్లి, మునుకుంట్ల, ఈదులురు, మిర్యాలగూడ-సూర్యాపేటల మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కట్టంగూర్ పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుండగా మండలంలో ఐదు ఇళ్లు పాక్షికంగా కూలాయి. 350ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పరడా, జూగునెల్లి రోడ్డు కోతకు గురైంది. మూసీ ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఆరుఫీట్ల మేర ఎత్తి 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇన్‌ఫ్లో 42వేలుగా వస్తుంది. అర్వపల్లిలో 19ఇళ్లు పాక్షికంగా రెండిళ్లు పూర్తిగా కూలాయి, కేతెపల్లి మండలంలో బీమారం వద్ధ మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుండగా మిర్యాలగూడ-సూర్యాపేటల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. సూర్యాపేట పట్టణంలో పలు వార్డుల్లో డ్రైనేజిలు పొంగగా లోతట్టు కాలనీల్లోని ఇళ్లకు వరద నీరు చేరింది.
మేళ్లచెర్వులోని పులిచింతల ప్రాజెక్టులో నీటి మట్టం 30టిఎంసిలకు చేరింది. దీంతో ఇరురాష్టల్ర ఓప్పందం మేరకు 30టిఎంసిలు దాటకుండా దిగువకు 78,702క్యూసెక్కుల నీటిని నాలుగుగేట్ల ద్వారా విడుదల కొనసాగిస్తున్నారు. ఇన్‌ఫ్లో కూడా అదే స్థాయిలో వస్తుంది. ముంపు గ్రామాల ప్రజలంతా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వేముపల్లిలో పాలేరువాగు, చెరువులు పొంగి 1000ఎకరాల మేరకు పంటలు నీటి పాలయ్యాయి. దామరచర్ల మండలంలో తాళ్లవీర్లగూడెం, నర్సాపురం రోడ్డు కల్వర్టులు కొట్టుకపోగా రాకపోకలు స్తంభించాయి. అడవిదేవులపల్లి, వీర్లపాలెం, నడిగడ్డలలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. తిప్పర్తి మండలంలో పజ్జూరు మినహా అన్ని గ్రామాల చెరువులు అలుగుపోస్తున్నాయి. కనె్నకల్ గ్రామానికి వెళ్లే దారి కొట్టుకపోయింది. కాజివారిగూడెం, తిప్పలమ్మగూడెం వాగులు పొంగి రోడ్ల మీదుగా ప్రవహించాయి. గుర్రంపోడు మండలంలో శేషలేటివాగు, కొప్పోలు, చేపూరు, మొసంగి, తేనెపల్లి చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ఉదృతికి ఆయా గ్రామాల పరిధిలో 250ఎకరాల పత్తి, 70 ఎకరాల్లో వరి పంటలు నీటి మునిగాయి. కాశీరాంతండా, పిట్టలగూడెం, పాల్వాయిలలో 10ఇల్లు పూర్తిగా కూలాయి. లక్ష్మిదేవిగూడెం చెరువు పొంగి తుర్కోని బావి ఎస్సీ కాలనీలోని ఇరువై ఇళ్లలోకి వరద నీరు చేరింది. మఠంపల్లి మండలంలో మట్టపల్లి కృష్ణానది వద్ధ మూసీ వరద ఉదృతి పెరిగి లక్ష్మినరసింహ ఆలయ ప్రహరి గోడను తాకింది. అప్రమత్తమైన అధికారులు ఆలయ రక్షణ చర్యలతో పాటు సమీప ప్రాంతాల్లోని మత్స్యకార్మికులను కుటుంబాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు. తోటపల్లి, పెదవీడు వాగులు పొంగి రోడ్ల మీదుగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కల్గించాయి. నిడమనూర్ మండలంలో మాదారం వాగు పొంగి నల్లగొండ వైపు రాకపోకలు ఆగిపోయాయి. నిడమనూర్ చెరువు పూర్తిగా నిండిపోగా, ఇతర చెరువులన్ని అలుగు పోస్తున్నాయి. 90ఎకరాల పంటలు నీట మునిగాయి. మిర్యాలగూడ డివిజన్‌లో 2,673ఎకరాల పంటలు నీట మునిగాయి. 77ఇండ్లు పాక్షికంగాకూలీపోగా 17పూర్తిగా కూలిపోయాయి.

89.4మిల్లిమీటర్ల వర్షాపాతం
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 89.4మిల్లిమీటర్ల సగటు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా దామరచర్ల మండలంలో 242.2మిల్లిమీటర్లు, నిడమనూరు 212.2, త్రిపురారంలో 202.8, గుర్రంపోడులో 200.8, వేములపల్లి 184.0, కనగల్ 176.2, చిట్యాలలో 170.6, నల్లగొండలో 151.2, వలిగొండలో 147.6, తిప్పర్తిలో 140.2, హాలియాలో 138.4, మునగాలలో 137.2, గుండాలలో 130.2, మిర్యాలగూడలో 128.6, తుర్కపల్లిలో 127.2, శాలిగౌరారంలో 126.6, మోత్కూర్‌లో 120.2, కట్టంగూర్‌లో 111.8, అర్వపల్లిలో 111.4, గరిడేపల్లిలో 98.4, చండూర్‌లో 95.8, బొమ్మలరామారంలో 95.2, తిరుమలగిరిలో 91.2, సూర్యాపేటలో 91.2, తుంగతుర్తిలో 90.6, రామన్నపేటలో 90.2, యాదగిరిగుట్టలో 87.6, నాంపల్లిలో 87.0, భువనగిరిలో 80.6, రాజాపేటలో 79.8, ఆలేరులో 78.6, పెన్‌పహడ్‌లో 77.4, నూతనకల్‌లో 76.6, చౌటుప్పల్‌లో 71.8, బీబీనగర్‌లో 71.2, పెద్ధవూరాలో 71.2, నేరడుచర్లలో 71.8, నకిరేకల్‌లో 70.6, నార్కట్‌పల్లిలో 69.8, నారాయణపూర్‌లో 65.4, ఆత్మకూర్(ఎం)లో 64.2, మర్రిగూడలో 59.4, చివ్వెంలలో 48.4, ఆత్మకూర్(ఎస్)లో 44.6, పోచంపల్లిలో 43.4, కేతెపల్లిలో 42.0, పిఏపల్లిలో 41, చింతపల్లిలో 40.8, దేవరకొండలో 37.0, మోతేలో 34.4, మేళ్లచెర్వులో 29.8, డిండిలో 27.8, చందంపేటలో 25.8, మునగాలలో 221.6, మఠంపల్లిలో 16.6, నడిగూడెంలో 9.6, హుజూర్‌నగర్‌లో 9.2, చిలుకూరులో 6, కోదాడలో 4.8మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది.