నల్గొండ

ప్రభుత్వాలు, ప్రజలు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 26 : గ్రామీణ క్రీడలైన కబాడీ, కోకోలను ప్రభుత్వాలు, అన్ని వర్గాల వారు ప్రోత్సహించాలని టిపిసిసి చీప్ హుజూర్‌నగర్ శాసనసభ్యుడు యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అండర్ 14 జిల్లా స్థాయి 62వ బాల, బాలికల కోకో పోటీల ముగింపు కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేసిన అనంతరం సభలో మాట్లాడారు. జిల్లా స్థాయి కోకో పోటీలు హుజూర్‌నగర్‌లో నిర్వహించటం సంతోషమని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలోరాణించి నల్లగొండ జిల్లాకు పేరు, ప్రఖ్యాతులు తేవాలని అన్నారు. పాఠశాలలో అదనపు గదుల మంజూరుకు తప్పక కృషి చేస్తానని, వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను, సియం దృష్టికి తీసుకెళ్లి శాసనసభలో ప్రస్తావిస్తానని హమీ ఇచ్చారు. గ్రామీణ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం శ్రద్ద చూపటం లేదని అన్నారు.
బాధిత రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి
రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురవటం వల్ల ప్రత్తి, మిర్చి పంటలకు బాగా నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే అధికారులతో సర్వే చేయించి రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజక్టులు అన్ని నిండాయని, ఒక ప్రణాళిక ప్రకారం పంటలకు సాగు నీరు విడుదల చేయాలని అన్నారు. జిల్లా స్థాయి కోకో పోటీలలో బాలురలో మిర్యాలగూడ ప్రథమ, దేవరకొండ ద్వితీయ బహుమతులు, బాలికల పోటీలలో భువనగిరి ప్రథమ, సూర్యాపేట ద్వితీయ బహుమతులు పొందారు. గెలుపొందిన క్రీడాకారులకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి షీల్డులు, బహుమతులు అందచేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌యం యల్ లక్‌పతినాయిక్ అధ్యక్షత వహించగా జిల్లా స్కూల్ గేమ్సు పెడరేషన్ కార్యదర్శి పుల్లయ్య, హుజూర్‌నగర్, గరిడేపల్లి జెడ్‌పిటిసిలు హపీజానిజాం, పెండెం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.