నల్గొండ

కొనసాగుతున్న మూసీ నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరదనీరు జిల్లాలో రెండవ అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నుండి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 10వేల180క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో యదావిదిగా అంతే నీటిని ఐదు క్రస్టు గేట్లను మూడు అడుగుల ఎత్తు లేపి దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం 644.1అడుగులతో 4.229టి ఎంసిల నీటి సామర్ధ్యంగా ఉంది. కుడికాల్వకు ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతుండడంతో ఎడమకాల్వకు 200క్యూసెక్కుల నీటిని, సూర్యాపేట పట్టణ ప్రజల తాగునీటి కోసం 55క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.