నల్గొండ

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, సెప్టెంబర్ 26: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరక్టర్ వై.మాధవి భరోసా ఇచ్చారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లెడుచెల్క, మందోళ్లగూడెం గ్రామాల్లో సోమవారం సాయంత్రం సందర్శించారు. పొలం గట్ల వెంట తిరిగి భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న పత్తి, వరి, కంది పంటలను పరిశీలించారు. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి భూగర్భజలమట్టం పెరిగి సాగు నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికలను అందజేస్తామని చెప్పారు. ఆమె వెంట ఎడిఎలు శైలజ, వినోద్‌కుమార్, ఎవో సిహెచ్.అనురాధ, ఎఇవో ప్రకాష్‌గౌడ్, శశంక్, సర్పంచ్ సుర్వి మల్లేశంగౌడ్, బక్క శంకరయ్య తదితరులు ఉన్నారు.