నల్గొండ

కలెక్టర్ లేఖ ఉంటేనే రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, సెప్టెంబర్ 26 : విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడే ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అధికారులతో మమేకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే మండల కేంద్రంలోని కసూర్బా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జయలక్ష్మి పాఠశాల సందర్శనకు వెళ్లిన అఖిలపక్షం నాయకులను లోనికి రావద్దని, కలెక్టర్ లేఖ ఉంటేనే తమ పాఠశాలలో అడుగు పెట్టాలని, మెండిగా, దురుసుగా మాట్లాడిన వైనం సోమవారం పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో విదార్థినీల స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్లిన సిపిఎం మునుగోడు డివిజన్ కార్యదర్శి ఎన్.చంద్రవౌళి, ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకులు బుషిపాక నర్సింహ్మ, నాయకులు వెళ్లగా మీకు అనుమతి లేదని, గేటుబయటే ఉండాలని, జిల్లా కలెక్టర్ లేఖ ఉంటేనే లోనికి రావాలంటూ నాయకులను వెనక్కు పంపించింది. దీంతో ఆగ్రహించిన నాయకులు పాఠశాల ఆవరణలోని భిష్మించుకొని కూర్చోని, ప్రిన్సిపల్ పనితీరు, మాటతీరుపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై స్థ్ధానిక అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు, ఆర్‌వి ఎం శాఖకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పాఠశాల లోపలికి విద్యార్థుల భోజన సమయంలో వెళ్లి పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ప్రిన్సిపల్ పనితీరుపై ఆరా తీశారు. రోజువారీ మెనూను పరిశీలించగా ప్రభుత్వ ఆదేశానుప్రకారం విద్యార్థులకు మెనూ అందడం లేదని, ప్రతి రోజు గుడ్డు, వారానికి ఒకరోజు చికెన్ పెట్టడం లేదని ఆరోపించారు. అలాగే నీళ్లచారు, ముద్ద అన్నంతో నామమత్రంగా విద్యార్థినీలకు భోజనం అందిస్తున్నారని, వారితోనే నీటిని తెప్పిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్ తన పద్ధతిని మార్చుకోకపోతే అఖిలపక్షం తరుపున విద్యార్థుల కోసం ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.