నల్గొండ

ఘనంగా బతుకమ్మ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, సెప్టెంబర్ 30: బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలిరోజు నిర్వహించే ఎంగిలిపువ్వు బతుకమ్మను శుక్రవారం మహిళలు పట్టణంలో, మండలపరిధిలోని గ్రామాల్లో ఘనంగా వైభవంగా జరుపుకున్నారు. 9రోజుల బతుకమ్మ సంబరాల్లో తొలిరోజైన ఎంగిలిపువ్వుకు మహిళలు తంగెడు, బంతి, చామంతి పువ్వులతో పాటు గడ్డి, గునుగు పువ్వులకు రంగులువేసి అందంగా బతుకమ్మలను పేర్చి ఇంట్లో గౌరమ్మను నిలిపి పూజలు నిర్వహించి అనంతరం పట్టణంలోని సద్దులచెర్వు, పుల్లారెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయా గ్రామాల్లో గ్రామపంచాయితీ కార్యాలయాలు, పాఠశాలల వద్ద బతుకమ్మను పాటలతో కొలిచి అనంతరం చెర్వుల్లో వదిలేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా అధికారులు పట్టణంలోని సద్దులచెర్వు వద్ద నిర్వహించే వేడుకల్లో పాల్గొన్నారు. పోలీసులు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు.
మిర్యాలగూడలో...
మిర్యాలగూడ: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని ఆయా గ్రామాలలో శుక్రవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఉత్సవాలు తొలిరోజయిన ఎంగిళి పువ్వు బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, కన్యకపరమేశ్వరి ఆలయంలో, రైల్వేస్టేషన్‌లోని కూర్చున్న గాంధి బొమ్మ వద్ద, ఎన్‌ఎస్‌పి క్యాంపు గ్రౌండ్‌లో, సాయిబాబా ఆలయంలో, రెడ్డికాలనీలోని కోదండ రామాలయం ఆవరణ, బోటింగ్‌పార్క్, హౌజింగ్‌బోర్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, సీతారాంపురంలోని గీతామందిర్ వద్దతోపాటు ఆయా వార్డులలోని కూడళ్లలో మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మలు తీసుకొచ్చారు. రాత్రి అయ్యేవరకు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని మహిళలు కోలాహలంగా పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం యాద్గార్‌పల్లి చెరువు, హౌజింగ్‌బోర్డు సమీపంలోని చెరువులో, సాగర్ ఎడమకాల్వలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కాగా జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.
కోదాడలో...
కోదాడ: ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారికంగా కోదాడ బాలుర హైస్కూల్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలను శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ఛైర్‌పర్సన్, బతుకమ్మ ఉత్సవాల కమిటీ అద్యక్షురాలు వంటిపులి అనిత నాగరాజు ప్రారంభించారు. సాంప్రదాయంగా మహిళలు బతుకమ్మలకు పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత తానే స్వయంగా తన ఇంటి దగ్గరనుండి బతుకమ్మ ఎత్తుకొని ఉత్సవాలకు రావడం విశేషం. పెద్ద సంఖ్యలో బాలుర హైస్కూల్‌కు బతుకమ్మలతో చేరుకొన్న మహిళలు, యువతులు బతుకమ్మ ఆటలు ఆడి, పాటలు పాడి అందరిని ఆకట్టుకొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పట్టణ ఇన్సిపెక్టర్ రజితారెడ్డి ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించగా బతుకమ్మ ఆడేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కమిషనర్ కందుల అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది చేశారు. బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు నూనె సులోచన, పబ్బా గీత, తూము శాంతమ్మ, ఇమ్మడి భాగ్యలక్ష్మి, పిట్టల భాగ్యమ్మ పాల్గొన్నారు.