నల్గొండ

గాంధీ మార్గంలో పయనిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ అనుసరించిన మార్గంలో పయనించి చక్కటి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా ఫోర్టు పోలియో జడ్జి బి.శివశంకర్‌రావు అన్నారు. ఆదివారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ అహింస, సత్యం, నిరాడంబరత మహాత్ముని ప్రధాన సూత్రాలన్నారు. జూనియర్ న్యాయవాదులు నిరంతరం కొత్త కొత్త చట్టాలను అధ్యయనం చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. న్యాయవాద వృత్తి ఎంతోగొప్పదని, బాధితులకు, పీడితులకు న్యాయ సహాయం అందించి వారికి అండగా నిలబడాలని న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో హైకోర్టు న్యాయమూర్తి ఎడవల్లి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాధులు వివిధ కోర్టుల తీర్పులను అధ్యయనం చేస్తూ వృత్తిలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్, జిల్లా జడ్జి డాక్టర్ జి.రాధారాణి, హైకోర్టు న్యాయవాది మహమూద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
న్యాయశాఖ అతిధిగృహం ప్రారంభం
జిల్లా కోర్టు భవనాల సముదాయంలో నిర్మించిన న్యాయశాఖ అతిధిగృహాన్ని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా ఫోర్టు పోలియో జడ్జి బి.శివశంకర్‌రావు ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోర్టులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మరో హైకోర్టు న్యాయమూర్తి ఏ.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా జడ్జి డాక్టర్ జి.రాధారాణి, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, నల్లగొండ ఆర్ డి ఒ వెంకటాచారి, న్యాయమూర్తులు ఐ.శైలజాదేవి, ఊట్కూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్, న్యాయవాదులు నూకల నర్సింహ్మారెడ్డి, లెనిన్‌బాబు, అమరేందర్‌రెడ్డి, భీమార్జున్‌రెడ్డి, సంధ్యారాణి, ప్రమీల, శంకరయ్య పాల్గొన్నారు.