నల్గొండ

తొమ్మిది గంటలు రోడ్డు దిగ్బధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, అక్టోబర్ 7 : గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపాలంటూ అఖిలపక్షాల పార్టీల నాయకులు చేస్తున్న ఆమరణ నిరాహర దీక్షలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. ఆమరణ దీక్ష శిభిరంలో కూర్చున్న సభ్యులలోని బిజెవై ఎం మండల అధ్యక్షులు కుమారస్వామి హైబీపీతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా పరిస్థితి విషమించడంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి వారి సూచనల మేరకు చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మేయిన్ రోడ్డుపై టెంటు వేసి వంటావార్పు నిర్వహించి 9 గంటలు రహదారిని దిగ్భందం చేశారు. గుండాల మండలాన్ని యాదాద్రిలో కలపాలంటూ బి ఎస్ ఎన్ ఎల్ టవర్‌ను ఎంపిటిసి మాధవి భర్త మాధవరెడ్డి, శంకర్, యాదగిరి ఎక్కి నిరసన తెలపగా స్ధానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ పైకి టి ఆర్ ఎస్ వి, జే ఎన్ టియు రాష్ట్ర నాయకులు వాడపల్లి మధు, పరమేష్‌లు ఎక్కి నిరసన తెలుతుపూ హల్‌చల్ చేశారు. ఈ సందర్భంగా ఆమరణ నిరాహర దీక్షలో కూర్చున్న ఎంపీపీ సంఘి వేణుగోపాల్, జెడ్పిటిసి మందడి రామకృష్ణారెడ్డి, టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రసాద్, సిపి ఎం పార్టీ నాయకులు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను, సిపి ఐ పార్టీ నాయకులు కొమరయ్యలు మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేంతవరకు ఆమరణ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. జనగాం జిల్లా ద్వారా మండల ప్రజలు దీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వ సౌకర్యాలలో ఈ ప్రాంతం వెనుకబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ధాల కాలం నుండి భువనగిరి, యాదాద్రి ప్రాంతాలతో అనుబంధం ఉన్న గుండాల మండల ప్రజల ఆకాంక్ష మేరకు యాదాద్రి జిల్లాలోనే గుండాల మండలాన్ని కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపి ఎం, సిపి ఐ, ఎం ఆర్ పి ఎస్ మండల అద్యక్షులు ప్రకాశ్, సుధాకర్, మద్దెల బాల్‌రెడ్డి, మరాటి బీరప్ప, మద్దెపురం రాజు, హరిచంద్ర, మట్టి కృష్ణ, గార్లపాటి సోమిరెడ్డి, ఎంపిటిసిలు మల్లయ్య, రాములు, సోమయ్య, శ్రీను, సర్పంచులు సునితశ్రీనివాస్, పురుగుల మల్లేష్, రమేష్, వెంకటేశ్, మాధవి, ద్యాప కృష్ణారెడ్డి, హరితాదేవి, శ్రీనివాస్, లగ్గాని రమేష్, మల్లేష్ పాల్గొన్నారు.