నల్గొండ

హరితహారం నిరంతరం కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం నిరంతరం కొనసాగించాలని, అభివృద్దికి అందరూ సహకరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శనివారం వలిగొండ మండలానికి మొట్టమొదటి సారిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా తహాశీల్థార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ హరితహారం నిరంతర ప్రక్రియగా నిర్వహించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు అన్ని గ్రామాల్లో వందశాతం పూర్తి చేయాలన్నారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలన్నారు. అభివృద్దిలో అందరూ సహకరించాలన్నారు. మండల కేంద్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సమస్య తన దృష్టికి రావడం జరిగిందని పరిశీలిస్తానని, భూసమస్యలు ఉన్నాయని, మిషన్ భగీరథ పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలిసిందని, మిషన్‌కాకతీయ పనులన్ని పూర్తయ్యాయన్నారు. సమావేశంలో కలెక్టర్‌కు జడ్పీటిసి మొగుళ్ల శ్రీనివాస్ సంగెం గ్రామంలో నివసించే దాదాపు 40 యానాదుల కుటుంబాలకు కులం గుర్తింపు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారి కులం గుర్తించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ శనివారం నాడు పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మార్చేందుకై స్ర్తిశక్త్భివనాన్ని పరిశీలించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు.