నల్గొండ

ప్రభుత్వ భూముల్లో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్,అక్టోబర్ 16: గ్రామాలలోని ప్రభుత్వ భూములలో పేద ప్రజలకు ఇంటి స్థలం కేటాయించి ప్రభుత్వమే డబుల్‌బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని కాచారం గ్రామంలోఅఖిల పక్షం ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం కోసం నిరవదిక నిరహారదీక్ష సంఘీభావం తెలిపిన అనంతరం మోత్కుపల్లి నర్సింహ్మలు మాట్లాడుతూ 25 సంవత్సరాలు తాను ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా,మంత్రిగా పని చేసిన రోజులో ప్రతి గ్రామంలో వౌళిక వసతులు కల్పించానని,కుల మతాల కతీతంగా నిరుపేదలైన వారికి ఇండ్ల స్థలాలు,్భములకు పట్టాలు పంపిణి చేశానని. టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చక పోక ప్రభుత్వ భూమి ఉన్నా ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయించటంలో జాప్యం చేస్తున్నారని కాచంరం,్ధర్మారెడ్డి గూడెం ప్రజలు రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ భూమి ఉందని ఆ భూమిని పేద ప్రజలకు పంచాలని నిరవదిక నిరాహార ధీక్ష చేస్తున్నా అధికారులు పటించుకోక పోవటం భాదాకరమని అన్నారు. వెంటనే గుట్ట ఎమ్మార్వోకు ఫోన్ చేసి కాచారం గ్రామంలోని ప్రభుత్వ భూమి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సపి యం జిల్లా సెక్రటరీ జహంగీర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ప్రజలకు పంచేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ రెండున్నర సంవత్సరాల పరిపాలనలో ఇంత వరకు ఏ ఒక్కరికి ఇండ్ల స్థలాలుకాని,్భములను పంపిణి చేయలేని అసమర్థపాలన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఐ రాష్ట్ర రైతుభిభాగం నాయకులు కొల్లూరి రాజయ్య, చొక్కా వెంకటేష్, టిడిపి మాజీ ఎంపీపీ దడిగె ఇస్తారి, మాజీ సర్పంచ్ బాలరాజు,కొండ మడుగు నర్సింహ్మ, మంగ నర్సింహ్మ పాల్గొన్నారు.