నల్గొండ

ముస్లిం పర్సన్‌లాలో మార్పుకు అంగీకరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, అక్టోబర్ 16: ముస్లిం పర్సనల్ లాలో ఎలాంటి మార్పులకు అంగీకరించబోమని జమ్మెతుల్ ఉల్మా ఏ హింద్ జిల్లా కమిటీ ప్రకటించింది. ఆదివారం జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశంలో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల ముస్లిం మత పెద్దలు, ఉలేమాలు, వివిధ పార్టీల మైనార్టీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను జిల్లా కమిటీ అధ్యక్షుడు వౌలాలా సయ్యద్ ఏహసానొద్దిన్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం లాకమిషన్ ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన నేపధ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశం మేరకు తమ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించామని ఆయన పేర్కోన్నారు. స్థానిక అక్పా మసీద్‌లో జరిగిన ఈ సమావేశంలో ముస్లిం పర్సనల్ లాలో ఎలాంటి మార్పులు అంగీకరించరాదని, లాకమిషన్ ప్రశ్నావళి తీరు చట్ట విరుద్దంగా ఉందన్నారు. ముస్లిం పర్సనల్ లా కమిషన్‌లో మార్పులను వ్యతిరేకిస్తు ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేసి పంపాలని సమావేశం తీర్మానించిందన్నారు. ఈ సమావేశంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ఖలీం, ముస్లిం పర్సనల్ లాబోర్డు జిల్లా కన్వీనర్ వౌలానా అబుల్ బసీర్, ఫహీం, గఫుర్ తదితరులు పాల్గొన్నారు.