నల్గొండ

ఎగిరిన స్వాతంత్య్ర జెండా..! అంతటా మువ్వనె్నల రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రాంతం నిజాం ప్రభువుల పరిపాలన నుండి విముక్తి పొంది భారత దేశంలో విలీనమైన సెప్టెంబర్ 17వేడుకలను సోమవారం వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి జాతీయ జెండాలు ఎగురవేశారు. బీజేపీ తెలంగాణ విమోఛనం పేరుతో, సిపిఐ, సిపిఎంలు తెలంగాణ విముక్తి దినోత్సవంగా, కాంగ్రెస్, టిజెఎస్‌లు తెలంగాణ విలీన దినోత్సవంగా సెప్టెంబర్ 17వేడుకలను నిర్వహించాయి. తహశీల్ధార్, ఆర్డీవో కార్యాలయాలపైన బీజేపీ, ఎబివిపి శ్రేణులు జాతీయ జెండాలు ఎగురవేశాయి. నల్లగొండ కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలపైన, మహాత్మగాంధీ ఇంజనీరింగ్ కళాశాలలపైన ఎబివిపి విద్యార్థులు పోలీసులను చేధించుకుని వెళ్లి జాతీయ జెండాలను ఎగురవేశారు. వలిగొండ, భువనగిరి, సూర్యాపేట ఆర్డీవో, గుర్రంపోడు, చండూర్, హాలియా, చింతపల్లి, దేవరకొండ, కనగల్, మిర్యాలగూడ, ఆలేరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలపైన బీజేపీ, ఎబివిపి కార్యకర్తలు జాతీయ జెండా ఎగురవేశారు. నల్లగొండ బీజేపీ కార్యాలయంపైన పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి, టిజెఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా కోఆర్డీనేటర్ ఎం.శ్రీ్ధర్‌లు జాతీయ జెండాలు ఎగురవేశారు. గడియారం సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ధ టి.జెఎసి జాతీయ జెండాను ఆవిష్కరించింది. సిపిఎం కార్యాలయంలో తెలంగాణ విముక్తి వారోత్సవాలను నిర్వహించి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో తెలంగాణ విద్రోహదినం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, రామోజిషణ్ముఖ, పల్లెబోయిన శ్యాంసుందర్, నూకల వెంకటనారాయణరెడ్డి, బాకి పాపయ్య, బండారు ప్రసాద్, పి.సాంబయ్య, ఎబివిపి జిల్లా కన్వీనర్ పొట్టిపాక నాగరాజు, నగర కార్యదర్శి ఆవుల సంపత్, ఆర్.కిరణ్‌కుమార్, రేవంత్, శ్రీకాంత్, సిపిఐ నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, పబ్బు వీరస్వామి, లెనిన్, మదార్, టిజెఎస్ నాయకు పన్నాల గోపాల్‌రెడ్డి, ధీరావత్ వీరానాయక్, శ్రీనివాస్‌రెడ్డి, టి.జెఎసి నాయకులు కేశవ్‌లు, సిపిఎం నాయకులు పెన్నా అనంతరామశర్మ, మీనయ్య, ఎండి.సలీమ్, హషమ్, నర్సిరెడ్డి, పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరి సాగర్, బి.వి.చారి, కండెల మహేష్, బొమ్మిడి నగరేష్ పాల్గొన్నారు.