జాతీయ వార్తలు

రాజీవ్ హంతకురాలు నళిని పెరోల్ పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అపరాధిగా ఉన్న నళిని పెరోల్‌ను మరో మూడు వారాలు పొడిస్తున్నట్లు మద్రాస్ట్ హైకోర్టు గురువారం తెలిపింది. వెల్లూరు కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నళినికి కుమార్తె వివాహ ఏర్పాట్లు చేసుకునేందుకు జూలై 25న నెల రోజుల పెరోల్‌ను మద్రాస్ హైకోర్టు మంజూరు చేసింది. తన కుమార్తె లండన్‌లో ఉందని.. సెప్టెంబర్ తొలి వారంలో ఆమె ఇండియాకు వస్తుందని.. ఆమె వచ్చాక పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాలని భావిస్తున్నందు వల్ల పెరోల్‌ను పొడిగించాలని పిటిషన్‌లో నళిని పేర్కొంది. జైలు ఉన్నతాధికారులు తన అభ్యర్థనను తిరస్కరించడంతో నళిని కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం మూడు వారాల పాటు పెరోల్‌ను పొడిగించింది.