ప్రకాశం

శివ నామస్మరణతో మారుమోగిన నల్లమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, మార్చి 7: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం శివనామ స్మరణతో నల్లమల మారుమ్రోగింది. శివరాత్రి సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీశైలంలో వెలసిన స్వయంభులింగమైన శ్రీమల్లికార్జునస్వామిని, శక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమరాంబదేవిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు, శివస్వాములు శ్రీశైలం వెళ్ళేందుకు పెద్దదోర్నాలకు చేరుకున్నారు. భక్తులతో పెద్దదోర్నాల కిటకిటలాడింది. అలాగే మోట్లమల్లికార్జునపురం వద్ద వెలసిన సిద్ధిమల్లికార్జున భ్రమరాంబదేవి కల్యాణ మహోత్సవం, రుద్రాభిషేకాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వెలుగొండ ప్రాజెక్టు ప్రతినిధి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో వెలసిన రామలింగేశ్వరస్వామి లింగమయ్య కొండపై భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని బాలకాశయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో పెద్దదోర్నాలలో అన్నదానం నిర్వహించారు. బోడెనాయక్ శివస్వాముల సంఘం ఆధ్వర్యంలో ఎడిఎ బాలాజీనాయక్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతల చెంచుగూడెం పట్ట్భారామస్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో తుమ్మలబైలు, చిన్నారుట్ల తదితర చెంచుగూడెల్లో శ్రీశైలం వెళ్ళె శివస్వాములకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలోని రామచంద్రకోట గ్రామంలో వెలసిన రామలింగేశ్వరస్వామి, పెద్దదోర్నాలలోని శివాలయంలో, సాయిబాబా ఆలయంలో, లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో వెలసిన శ్రీచెన్నమల్లేశ్వరస్వామి తదితర దేవాలయాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నటరాజ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.

కందుకూరులో ఘనంగా శివరాత్రి వేడుకలు
కందుకూరు, మార్చి 7: మహాశివరాత్రి వేడుకలను సోమవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డివిజన్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భైరవకోన, మిట్టపాలెం, జమ్ములపాలెంలోని 1116 శివలింగాల వేదిక, సంగమేశ్వరం, నర్శింగోలు, మనే్నటికోట, అమరలింగేశ్వరస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ శైవక్షేత్రాలతోపాటు లింగసముద్రం, మొగిలిచర్లలో వేంచేసిన తిరుమణిశెట్టి కోటయ్య, దత్తాత్రేయస్వామి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకాలు జరిగాయి. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఆయా దేవాలయాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూజలు నిర్వహించారు. పట్టణంలోని గుర్రంవారిపాలెంలో గల సోమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్యనాయుడు దంపతులు, ఆర్టీసీ డిఎం శ్రీనివాసశర్మ దంపతులు, తదితర ప్రముఖులు, అధికారులు స్వామివారిని దర్శించుకుని కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అలాగే పడమటి బలిజపాలెం వద్ద పడమటి ముఖ ఏకాంబరేశ్వర దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, టిడిపి పట్టణ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, వైసిపి నాయకులు ఉన్నం వీరాస్వామి తదితరులు పూజలు చేశారు. వేలాది మంది భక్తుల నడుమ నవగ్రహ జంట నాగేంద్రస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు జరిగాయి. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 12గంటలకు లింగోద్భవ కాలంలో 1001 బిందెలతో స్వామివారికి అభిషేకం, కర్పూర హారతి నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ వారు విద్యుత్ ప్రభను ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మండల పరిధిలోని పలుకూరు గ్రామంలో గల శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా పొన్నలూరు మండలంలోని సంగమేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. కాకతీయ, రెడ్డివారి సత్రాలు ద్వారా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. జరుగుమల్లి మండలం నర్శింగోలులో గంగాసమేత అమరలింగేశ్వర ఆలయంలో, శనీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉలవపాడు మండలంలోని మనే్నటికోటలో అమరలింగేశ్వరస్వామి పురాతన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. లింగసముద్రం, మొగిలిచర్ల గ్రామాల్లో గల తిరుమణిశెట్టి కోటయ్య, దత్తాత్రేయస్వామి మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు పి నాగేంద్రప్రసాద్ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక డిఎస్పీ వి శ్రీనివాసరావు, రాళ్లపాడు డిఇ శ్రీనివాసమూర్తి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సంతనూతలపాడులో...
సంతనూతలపాడు : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు దేవాలయాలు శివ నామస్మరణతో హోరెత్తాయి. అందులో భాగంగా సంతనూతలపాడు, పేర్నమిట్ట, మైనంపాడు, ఎండ్లూరు, రుద్రవరం, గురువారెడ్డిపాలెం, గుడిపాడు, చిలకపాడు, మద్దులూరు, మంగమూరు గ్రామాల్లోని శివాలయాల్లో వేకువ జాము నుండే మహిళలు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అందులో భాగంగా సంతనూతలపాడు శివాలయంలో శివునికి అభిషేకాలు, పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలను ఆలయ అర్చకులు బుచ్చిబాబు శర్మ నిర్వహించారు. అలాగే పేర్నమిట్ట దత్తపురంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. సంతనూతలపాడు శివాలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి శిఖాకొల్లి వెంకట సుబ్బారావు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలను ఎండోమెంట్ ఈవో పి సుబ్బారావు, ఆలయ ప్రతినిధి పోకూరి రవీంద్ర తదితరులు పర్యవేక్షించారు. పేర్నమిట్ట సాయిబాబా గుడిలో పేర్నమిట్ట హరిప్రసాద్‌రావు, రావూరి వెంకటేశ్వరరెడ్డిలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే ఆయా ఆలయాల్లో అర్చకులు ఎన్ వెంకట సుబ్బయ్య శర్మ, అప్పారావు, ఎ ప్రసాద్, సురేష్, ఎన్ రవి, ఎస్ వెంకటేశ్వర్లు, పి రామచంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.