నల్గొండ

సహకారం మరచి స్వాహా చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం, మార్చి 31: రైతులకు సహకారం అందించాల్సిన సహాకార సంఘంలో నిధులు అడ్డదారులు తొక్కాయి. బినామీపేర్లతో పాలకవర్గానికి తెలియకుండా చైర్మన్ సంఘం నిధులు లక్షల్లో స్వాహాచేసిన తీరు నడిగూడెం సహాకారసంఘంలో వెలుగుచూసింది. గత పదేళ్లనుంచి చైర్మన్‌గా పనిచేస్తున్న దేవబత్తిని సురేష్‌ప్రసాద్ సహాకారసంఘంలో తమ బంధువులు, మండలంలో సంఘంపరిధిలో లేని వారి పేర్లతో రూ.లక్షల రూపాయాల్లో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం మంజూరుచేసిన రుణమాఫీని సైతం తానే స్వాహచేశాడు. దీనిపై సంఘం సభ్యుడు కొల్లు శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చైర్మన్‌పై స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదైంది. ఈ అవినీతితంతుపై పోలీసులు విచారణ చేపట్టారు. రుణమాఫీ వర్తించని రైతులకు ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు రూ.5వేల చోప్పున పరిహారం మంజూరు చేసింది. రైతులకు పరిహారం పంపిణీ చేయకుండా చైర్మన్ రూ.49లక్షలను స్వాహా చేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. తమకు పరిహారం అందలేదని రైతులు అధికారులకు ఫిర్యాదుచేశారు. సంఘం అక్రమాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు అందాయి.
ఒకే ఇంట్లో నాలుగు ట్రాక్టర్ రుణాలు
చైర్మన్ తన తండ్రి, తల్లి, ఆయన, తమ్ముడుపేర్లు ఓకే ఇంట్లో నాలుగు ట్రాక్టరు రుణాలను తీసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన సబ్సీడిని స్వాహాచేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులకు అందజేయాల్సిన ట్రాక్టరు రుణాలను తన ఇష్టానుసారం పంపిణీ చేసినట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
పెట్రోలు బంకులోనూ అవినీతి పర్వం
సంఘం తరపున మంజూరైన ఐఒసి పెట్రోల్‌బంకు నిర్మాణంకోసం మొదట స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. తరువాత లీజు మార్చి సదరు స్థలాన్ని చైర్మన్ తన పేరుమీదగా కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తిరిగి తన మామ పేరున మార్చి అట్టి స్థలాన్ని సంఘానికి అద్దెకు ఇచ్చినట్లు డాక్యూమెంట్లు తయారు చేశారు. దానిని మార్చి రూ.4లక్షలకు కొనుగోలు చేసిన స్థలాన్ని రూ.25లక్షలకు సంఘానికి అమ్మినట్లు నిధులు స్వాహా చేసినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్‌బంకు గదుల నిర్మాణానికి టెండర్లు వేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా చైర్మనే నిర్మాణ పనులు చేపట్టినట్లు సభ్యులు చెబుతున్నారు. రూ.4లక్షల విలువకూడ చేయని రెండుగదుల నిర్మాణానికి రూ.9.50 లక్షలు ఖర్చయినట్లుగా చూపి బిల్లులు ఎత్తినట్లుగా చెబుతున్నారు. ఇలా తవ్విన కొద్ది సంఘంలో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే ఆవకాశం ఉంది. రైతులకు చెందిన సంఘం నిధులను బినామీపేర్లతో స్వాహాకు పాల్పడిన చైర్మన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సంఘాన్ని కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈ అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎక్లాస్కాన్‌పేటకు చెందిన సంఘం సభ్యుడు కొల్లు శ్రీనివాస్ జిల్లా కలెక్టరుకు సైతం పిర్యాదు చేశారు.