నాలుగు కథల కాపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేసా రాజేష్ ప్రధాన పాత్రలో రోహిణి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కాపాలి’ (మిమ్మల్ని మీరే కాపాడుకోండి). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మేసా రాజేష్ మాట్లాడుతూ- దాదాపు అనేక భాషల్లో చిత్రాలు చూసిన నేపథ్యంలో ఓ వైవిధ్యమైన చిత్రం తీయాలనే కోరికతో కాపాలి రూపొందించామని తెలిపారు. ఓ జర్నలిస్టు తనకు అప్పగించిన టాస్క్ ఎలా పూర్తిచేశాడు అనే కథనంతో నాలుగు కథలు ఒకేసారి జరిగేలా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ అన్ని చిత్రాలకు భిన్నంగా వుంటుందన్నమాట ఖచ్చితంగా చెప్పగలనని, జర్నలిస్టు నిజ జీవితంలో ప్రాణాలకు తెగించి ఎలా కష్టపడుతున్నారో ఈ సినిమాలో చూపారని ఆయన అన్నారు.