నమ్మండి! ఇది నిజం!!

కారులో తొలి ప్రపంచ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెనడాలోని విన్నీపెగ్‌లో జన్మించిన ఇద్రిస్ గాల్షియా హాల్ ప్రపంచాన్ని కారులో చుట్టిన మొట్టమొదటి మహిళ. పడవలో జన్మించిన ఈమెకి చిన్నప్పటి నించే సాహసాలంటే ఇష్టం.
1919లో వెనేరియన్ జోహనెస్ పైసిన్‌స్కీ అనే పోలిష్ పౌరుడు కెప్టెన్ వాల్టర్ వాండర్‌వెల్‌గా పేరు మార్చుకుని, కెమెరాతో, సిబ్బందితో ఛాంగో అనే పెంపుడు కోతితో వాండర్‌వెల్ ఎక్స్‌పెడిషన్ పేరుతో ప్రపంచ యాత్రని చేపట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసింది. అంతర్జాతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, కొత్తగా ఏర్పడ్డ నానాజాతి సమితికి ప్రచారం చేయడానికి అతను ఈ యాత్రని చేపట్టాడు.
సావనీర్ కరపత్రాలు అమ్మి, డబ్బు తీసుకుని సభల్లో ఉపన్యాసాలు ఇచ్చి, ఈ యాత్రలో తీయబోయే సినిమాలకి టిక్కెట్లని అమ్మి కావాల్సిన డబ్బుని సంపాదించాడు. ఐతే తన భార్యతో విభేదాలు రావడంతో సెక్రటరీగా, డ్రైవర్‌గా భార్య స్థానంలో కొత్త వ్యక్తి అవసరం ఏర్పడింది. దాంతో పేపర్ ప్రకటనని ఇచ్చాడు. వచ్చిన అభ్యర్థుల్లో ఇద్రిస్ నచ్చింది. కారణం ఆమె ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్ భాషలని చక్కగా మాట్లాడుతుంది. రష్యన్, చైనీస్, జపనీస్ భాషలు కూడా కొంత వచ్చు. ఇద్రిస్ పేరుని అలోహా వాండర్‌వెల్‌గా మార్చాడు.
1922లో 18 ఏళ్ల అలోహా, వాండర్ వెల్‌తో కలిసి ప్రపంచ యాత్రని ఆరంభించింది. ఇందుకోసం మోడల్ టి ఫోర్డ్ కారుని వాడి నాలుగు ఖండాల్లోని నలభై మూడు దేశాలని సందర్శించింది. టర్కీ, ఈజిప్ట్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ చూసింది. మగాడిగా మారువేషం వేసుకుని మక్కా వెళ్లి ప్రార్థించింది. ఫ్రాన్స్ యుద్ధ భూముల్లో తిరిగింది.
అలోహా ఫెమినిస్ట్. మగవాళ్లలా దుస్తులని ధరించేది. 17వ ఏట నించి జుట్టుని మగాళ్లలా కత్తిరించుకునేది. తోలు జెర్కిన్, తెల్ల షర్ట్, గుర్రాలని స్వారీ చేసేప్పుడు వేసుకునే పేంట్, పైలెట్స్ పెట్టుకునే తోలు టోపీ, భుజాన బేక్‌పేక్ ఆమె ఆహార్యంగా ఉండేది.
‘ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో నన్ను ఆపి చాలా ప్రశ్నలు వేశారు. నేను యువతిని కాక యువకుడ్ని అయుంటే ఆపేవారు కాదు’ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
మొదటగా అతనికి సెక్రటరీగా ఉన్నా త్వరలోనే ఆ ప్రయాణం మొత్తం తీసిన సినిమాకి నటిగా, దర్శకురాలిగా కూడా పని చేసింది. వారు ప్రయాణించిన కారు మోడల్ టి ఫోర్డ్. దాని ముద్దు పేరు లిటిల్ లిజ్జీ. ఆ కారునే ఉపయోగించడానికి కారణం అది ఎక్కువ మన్నుతుంది. దాని విడి భాగాలు ప్రపంచంలోని చాలా చోట్ల తేలిగ్గా దొరుకుతాయి. ఈ ప్రయాణం వల్ల మోడల్ టి ఫోర్డ్‌కి కూడా చక్కటి ప్రచారం కూడా లభించింది.
వారిద్దరూ ఆ ప్రయాణంలో అనేక కష్టాలని అనుభవించారు. ఇండియా, చైనా దేశాల్లో రోడ్లు సరిగ్గా లేక డ్రైవింగ్‌కి ఇబ్బంది పడ్డానని అలోహా చెప్పింది. కొన్ని చోట్ల పెట్రోల్ బదులు కిరోసిన్‌ని, మరి కొన్ని చోట్ల నీళ్లు కలిపిన ఏనుగు కొవ్వుని, గ్రీజ్‌గా అరటి పండు గుజ్జుని వాడాల్సి వచ్చింది. చైనాలో 1924లో జరిగిన అంతర్యుద్ధం వల్ల పెట్రోల్ దొరకడం కష్టం అయింది. ఇవేమీ దొరకనప్పుడు వారు కారుని నదుల్లో బురదలో తోయాల్సి వచ్చింది. ఆఫ్రికాలో ఎద్దులని కట్టి కారుని నడిపారు. చైనాలో ఆమెని దొంగలు కిడ్నాప్ చేశారు. వారికి మెషీన్‌గన్‌ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తే వదిలి పెట్టారు. టర్కీ, ఈజిప్ట్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ చూసారు.
ఈ ప్రయాణంలో అలోహా, వాండర్‌వెల్‌లు ప్రేమలో పడి 1925లో అమెరికాలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో వాండర్‌వెల్‌ని జర్మన్ గూఢచారి అనే అనుమానంతో అరెస్ట్ చేద్దామనుకున్నా, ఎఫ్‌బిఐ వారు ఈ పెళ్లి వల్ల అరెస్ట్ చేయలేకపోయారు. ఈ ప్రయాణంలోనే వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఐనా ప్రయాణాన్ని ఆపలేదు. ఒకరు క్యూబాలో, మరొకరు సౌత్ ఆఫ్రికాలో పుట్టారు.
1932లో వీరు ది కార్మ్ అనే మరపడవలో ఉండగా వాండర్‌వెల్‌ని ఎవరో హత్య చేయడంతో ఈ ప్రయాణం ఆగింది. హంతకుడు ఎవరో ఈ రోజుకీ తెలుసుకోలేక పోయారు. సంవత్సరం తర్వాత అలోహా తన భర్త మిత్రుడు, మాజీ కెమెరామేన్ అయిన వాల్టర్ బేకర్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ హత్య, ఆమె రెండో పెళ్లి గురించి అమెరికన్ పత్రికలు అనేక అభూత కల్పనలని రాసాయి. ఆ తర్వాత వారు తిరిగి ప్రయాణాన్ని కొనసాగించారు.
1922 నించి 1937 దాకా పదిహేనేళ్ల పాటు ఆమె ప్రయాణానికి సంబంధించిన రికార్డులని, డైరీలని చక్కగా రాయడమే కాక కాపాడింది కూడా. ప్రతీ ఊళ్లో అలోహా ఇచ్చిన ఉపన్యాసాలని వాల్టర్ సినిమాగా తీసి తర్వాతి ఊళ్లో ప్రదర్శించేవాడు.
అలోహా తను తీసిన డాక్యుమెంటరీకి ‘కార్ అండ్ కెమెరా ఎరౌండ్ ది వరల్డ్’ అనే పేరు పెట్టి 1942లో ఫోర్డ్ కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్‌కి చూపించింది. కాని రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూండటంతో ఆయన దానికి ఇవ్వాల్సిన చారిత్రాత్మక ప్రాముఖ్యతని ఇవ్వలేదు.
అలోహా 1970ల దాకా తన అనుభవాల మీద ఉపన్యాసాలని ఇస్తూనే ఉంది. ప్రయాణానంతరం బ్రెజిల్‌లోని రివర్ ఆఫ్ డెత్ అనే ముద్దు పేరుగల నది మీద విమానాన్ని నడిపింది. అది కూలిపోవడంతో తొమ్మిది నెలల పాటు బోర్నియాలో స్థానిక ఆటవికుల మధ్య జీవించింది.
కేలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ అనే ఊళ్లో 4 జూన్ 1996న, తన 89వ ఏట అలోహా మరణించింది. ఆ మరణం గురించి పేపర్లలో పెద్దగా కవర్ చేయలేదు.
ఆమె చిత్రీకరించిన సినిమాలు, తీసిన ఫొటోలు నేడు అనేక మ్యూజియాల్లో, విద్యాలయాల్లో ప్రదర్శనలో ఉన్నాయి. బ్రెజిల్‌లోని బోరోరోస్ అనే గ్రామీణుల మీద ఆమె చిత్రీకరించిన సినిమాని వాషింగ్టన్ డి సిలోని స్మిత్ సోనియన్ మ్యూజియంలో భద్రపరిచారు.

పద్మజ